సాక్షి, హైదరాబాద్ : దిశ కేసులో నిందితులు పోలీసులపైకి కాల్పులు జరపడంతోనే ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. తొలుత నిందితులు రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి యత్నించారని, ఆ తర్వాత రెండు తుపాకులు లాక్కున్నారని సజ్జనార్ చెప్పారు. దీంతో తాము ఫైరింగ్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున చటాన్‌పల్లిలో దిశ నిందుతులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 27 అర్ధరాత్రి దిశపై అత్యాచారం, హత్య జరిగింది. ఆ తర్వాత చటాన్‌పల్లి వద్ద దిశను తగులబెట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. అలాగే శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించాం. అరెస్ట్ చేసిన నలుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం. నిందితులను ఈ నెల 2న కోర్డు పదిరోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో 4న చర్లపల్లి జైలు నుంచి కస్టడీలో తీసుకోని విచారించాం. చటాన్‌పల్లిలో బాధితురాలి సెల్‌ఫోన్, ఇతర వస్తువులు దాచిపెట్టామని నిందితులు విచారణలో వెల్లడించారు.
దీంతో ఆ వస్తువులను రికవరీ చేసేందుకు నిందితులను ఈ రోజు తెల్లవారుజామున చటాన్‌పల్లికి తీసుకొచ్చాం. వారిచ్చిన సమాచారం మేరకు దిశ సెల్‌ఫోన్, వాచ్, పవర్‌బ్యాంక్‌లను సేకరించాం. అయితే నిందితులు ఇక్కడికి వచ్చిన తరువాత పోలీసులపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. అలాగే పోలీసులకు చెందిన రెండు తుపాకులను లాక్కుని కాల్పులు జరిపారు. పోలీసులు హెచ్చరించిన కూడా నిందితులు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయారు. నిందితులు ఆరిఫ్, చెన్నకేశవుల దగ్గర గన్స్ స్వాధీనం చేసుకున్నాం. నిందితులు చేసిన రాళ్ల దాడిలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 గంటల మధ్య ఈ ఘటన జరిగింది.
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు గతంలో చాలా నేరాలు చేశారనే అనుమానాలు ఉన్నాయి. కర్ణాటక, ఏపీలో మిస్సింగ్ కేసులను పరిశీలించాలి. దీనిపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంద’ని చెప్పారు. దిశ కుటుంబ సభ్యుల ప్రైవసీకి ఇబ్బంది కలిగించవద్దని కోరారు. మృతదేహాలకు మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన తరువాత వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు.
చదవండి : దిశ నిందితుల ఎన్కౌంటర్
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు
దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం
దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ?
‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు..
Comments
Please login to add a commentAdd a comment