ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి | election arrangements complete | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

Published Sun, Apr 27 2014 1:58 AM | Last Updated on Wed, Sep 5 2018 2:01 PM

election arrangements complete

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ బీ.శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు, ఎన్నికల పరిశీలకులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,042 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటిలో 4,196 కేంద్రాలు సైబరాబాద్ పరిధిలో, 846 కేంద్రాలు గ్రామీణ ఎస్పీ పరిధిలో ఉన్నాయన్నారు. సున్నిత, అతిసున్నిత కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,069 సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు.

అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సున్నిత, అతి సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 332 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామన్నా రు. ఈ సమావేశంలో ఎస్పీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement