పెను ప్రమాదం సంభవించి ప్రజలంతా కుటుంబాలతో పరుగులు పెడుతుంటే వారు మాత్రం కుటుంబాలను వదిలేసి ప్రజల కోసం పరుగులు పెడతారు. గొడవలు పెరిగి ఊరుఊరంతా భయపడుతుంటే వీధుల్లో బూటు చప్పుళ్లు చేస్తూ ‘మీకు మేమున్నాం’ అంటూ భరోసా ఇస్తారు. విపత్తు సంభవిస్తే వారుండాలి... వివాదం జరిగినా వారుండాలి... ప్రమాదమైనా... ప్రమోదమైనా పోలీస్ కనిపించకపోతే ఏ కార్యక్రమమూ జరగదు. సమాజాన్ని కుటుంబంలా చూస్తూ... ఆ కుటుంబానికి భద్రత కల్పించడం వారి విధి. అందుకే ఆయుధాలు పట్టుకున్నా వారు శాంతికాముకులే. లాఠీ ఝుళిపించినా అహింసావాదులే. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ సందర్భంగా...
విజయనగరం క్రైం: సమయంతో సంబంధం లేని ఉద్యోగమైనా వారి నిబద్ధతలో మార్పు ఉండదు. సరదాలు, షికార్లు లేకపోయినా వారి పనితీరులో మార్పు ఉండదు. ప్రజల కోసం ప్రాణాలను సైతం అర్పించే అతికొద్ది అ‘సామాన్యుల్లో’ పోలీసులు ఒకరు. నేడు వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన రో జు. ప్రజల క్షేమం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను గుర్తుకు తెచ్చుకుని వారి కోసం రెండు కన్నీటి బొట్లను నివాళిగా అర్పించాల్సిన రోజు. 1959 అక్టోబర్ 21న కాశ్మీర్ లడక్ స్పింగ్ హాట్ ప్రాంతంలో పోలీసుల గస్తీ కాస్తుంటే అవుట్ పోస్టులోని జవాన్లపై చైనా జవానులు కాల్పులు జరిపారు. ఈ పోరులో పది మంది భారత జవానులు వీరోచితంగా పోరాడి మరణించారు. అప్పటి నుంచి ఏటా ఇదే రోజు పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
అమరవీరుల కుటుంబాలకు సత్కారం...
జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహిస్తారు. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో అమరులైన పోలీసు కుటుంబాలను సముచిత రీతిలో సత్కరిస్తారు. అక్టోబర్ 15 నుంచి అమరవీరుల వారత్సవా లు జరుగుతాయి.
స్మారక స్థూపం
పోలీసు పరేడ్ మైదానంలో అమరవీరుల స్మృతికి చి హ్నంగా 2001లో నలభై అడుగుల స్థూపం నిర్మిం చారు. అప్పటి ఎస్పీ సౌమ్యామిశ్రా పర్యవేక్షణలో లక్ష రూపాయల వ్యయం, పోలీసుల శ్రమదానంతో ఇది రూపుదిద్దుకుంది. అదే ఏడాది అక్టోబర్ 21న స్థూపా న్ని ఆవిష్కరించారు.
కుటుంబాలకు తీరని లోటు
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎన్ని రకాలుగా సాయం చేసినా వారు ఏని లోటు పూడ్చలేం. శాంతి భద్రతలు కాపాడడంలో వారి పాత్ర కీలకమైనది. పోలీసులకు వారాంతపు సెలవులు, జీతాలు పెంచి పోలీసుల సంక్షేమానికి కృషి చేయాలి.
- ఎంవీఆర్ సింహాచలం (రామా),
పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
మన హీరోలు
సీఐ గాంధీ
పీపుల్స్ వార్ నక్సల్స్ కాల్పుల్లో మృతి చెందిన సీఐ గాంధీని జిల్లా పోలీ సు శాఖ ఏటా స్మరించుకుంటుంది. 2001లో సెప్టెంబర్ 28న సాలూరు కోర్టులో నక్సల్స్ సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన గాంధీని కోర్టు హాలులోనే కాల్చి చంపారు. ఆయన స్మారకార్థం ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
చిరంజీవిరావు
సీఐ ముద్డాడ గాంధీకి గన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆయనతోపాటు నక్సల్స్ కాల్పుల్లో చిరంజీవిరావు మృతిచెందారు. ఈయన 1985లో పోలీసుశాఖలో చేరారు.
ఇస్మాయిల్
1978లో పోలీసుశాఖలో చేరిన ఎ.కె.ఇస్మాయిల్ మోటారు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ డ్రైవర్‌గా పనిచేసేవారు. కురుపాం మండలంలోని లోవలక్ష్మిపురంలో నక్సల్స్ అమర్చిన మందుపాతరలో వాహనం దగ్ధమైంది. అందులో ఇస్మాయిల్ చనిపోయారు.
ఎం.సత్యనారాయణ
1988లో ఎస్.కోటలో లాకప్ డెత్ జరిగింది. ఈ నేపథ్యంలో జరిగిన ఆందోళన, హింస సంఘటనలో ఎం.సత్యనారాయణ మరణించారు. ఆయన 1978లో ఉద్యోగంలో చేరారు.
ఎస్.సూర్యనారాయణ
2003 మే 30న మక్కువ మండలం పెద్దింటిజోలలో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ పెట్టిన మందుపాతరకు కానిస్టేబుల్ ఎస్.సూర్యనారాయణ బలయ్యారు.
సలాం పోలీస్
Published Tue, Oct 21 2014 3:32 AM | Last Updated on Tue, Aug 21 2018 7:46 PM
Advertisement
Advertisement