
సాక్షి, గుంటూరు: పక్కా ప్లాన్‌తోనే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలపై దాడి చేశారని హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పెదనండిపాడు మండలం కొప్పర్రులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నేతలను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొప్పర్రులో వినాయక నిమజ్జనానికి వైఎస్సార్‌సీపీ నేతలు సహకరించారని తెలిపారు.
చదవండి: ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
టీడీపీ నేతలు ముందుగానే ఇంటిపై రాళ్లు సిద్ధం చేసుకున్నారని అన్నారు. బత్తుల శారద ఇంట్లోకి వెళ్లి టీడీపీ నేతలే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌పై కూడా టీడీపీ నేతలు దాడి చేశారని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు భయానక వాతావరణ సృష్టించారని దుయ్యబట్టారు.
చదవండి: USAID Mission Director Veena Reddy: కోవిడ్ సాయం.. ఐదు కోట్ల మందికి