సాక్షి, గుంటూరు: కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కరోనా బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, నిర్లక్ష్యంగా ఉండకుండా అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు నంబూరులోని కల్వరి టెంపుల్‌లో కోవిడ్‌కేర్ సెంటర్‌ను మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్ , కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం హోంమంత్రి మేకతోటి సూచరిత మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచ మానవాళి అంతా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, సెకండ్ వేవ్‌లో అనేక కుటుంబాలు కోవిడ్ బారిన పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో బైబిల్‌లో చెప్పిన మాటను ఆదర్శంగా తీసుకుని ఇలా సేవ చెయ్యడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కల్వరి టెంపుల్ బ్రదర్ సతీష్‌ను అభినందించారు.
జాగ్రత్తగా ఉండాలి
పేదవారికి ఉచిత మందులు, ఆహారం అందించేందుకు ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక్కడ ప్రార్ధించడంతోపాటు సేవ చెయ్యడం అభినందనీయమన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ప్రతి రోజు 25వేలకు పైగా పెరుగుతున్నాయని, కర్ఫ్యూ పెట్టినా కొంత మంది నిర్లక్ష్యం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండడం ఇతరులకు మంచి చేసినట్లే అవుతుందని, ప్రభుత్వం కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి అన్ని రకాల సదుపాయాలు అందిస్తుందన్నారు.
వివక్ష చూపవద్దు.. అండగా ఉందాం
బ్రదర్ సతీష్ కుమార్ మన వంతు ఏమి చెయ్యాలి అని ఆలోచించి కల్వరి టెంపుల్‌లో కోవిడ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. కోవిడ్ వల్ల మనకు తెలిసిన వాళ్ళ చాలా మంది చనిపోతున్నారని, కోవిడ్ వచ్చిన బాధితులపై వివక్షత చూపవద్దని, వారికి మానసిక అండగా ఉందామని సూచించారు. కోవిడ్ వచ్చిన వారి పట్ల ప్రేమగా వ్యవహరించాలని, కోవిడ్ వచ్చిన వారిని దూరంగా పెట్టొద్దని హితవు పలికారు. అందరం కలిసి కట్టుగా ఈ కోవిడ్ మహమ్మరిని తరిమి కొడదామని, బ్రదర్ సతీష్ చేసే మంచి పనులుకు అందరం సహకరిస్తామని తెలిపారు. ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసే నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి:
ఏపీ: కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ బస్సులు
పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
Comments
Please login to add a commentAdd a comment