
మిర్చి@ రూ. 17,500
వరంగల్ సిటీ: మిర్చికి ధర తగ్గిందని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో మంగళవారం వరంగల్ మార్కెట్‌లో సింగిల్ పట్టి రకం మిర్చికి రికార్డుస్థాయిలో ధర పలికింది. ఈ రకం మిర్చి క్వింటాల్‌కు రూ. 17,500 ధర పలికింది. గతేడాది సింగిల్‌పట్టి రకం మిర్చికి అత్యధికంగా రూ. 16,500 ధర పలికింది.
మంగళ వారం పరకాలకు చెందిన రవీందర్ మొదటిసారి 7 బస్తాల నాణ్యమైన సింగిల్ పట్టి రకం మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా ఈ ధర పలికింది. దేశీ రకం మిర్చి కూడా మొదటిసారి క్వింటాల్‌కు రూ.14,500, 13,500 ధర పలికింది. ఇదే దేశీ రకం మిర్చికి గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.18,001 రికార్డు ధర పలికింది.