
ముంబై: టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ ‘‘సెలెస్ట్ ఎక్స్ సచిన్ టెండూల్కర్’’ పేరుతో ప్రత్యేక కలెక్షన్ ఆవిష్కరించింది. భిన్న సమ్మే ళనం, ఖచ్చితత్వం, పరిపూర్ణతతో రూపొందించిన ఈ ఆభరణ శ్రేణిలో ఉంగరాలు, చెవి రింగులు, బ్రాస్‌లైట్లు ఉన్నాయి.
అరుదైన ఈ కలెక్షన్‌ను లెజెండరీ క్రికెటర్ సచిన్ 50వ సంవత్సరంలో, వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డుకు గుర్తుగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. తనిష్క్ రూపొందించిన ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ కలెక్షన్ కోసం వారితో భాగస్వామ్యం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment