Varadhi
-
‘వారధి’క్యం
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే పడవో, పంటో ఎక్కాల్సిందే. మరో దారి లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతూ కొవ్వూరు వెళ్లేవారు. కొవ్వూరు నుంచి తిరిగి రావాలన్నా మళ్లీ అదే మార్గం..అదే కష్టం..1976 నుంచి ఈ ఇబ్బందులు తప్పాయి. ఉభయ గోదావరి జిల్లాలను (విభజనకు ముందు) కలుపుతూ అఖండ గోదావరిపై రోడ్డు కం రైలు వంతెన ప్రారంభమైంది. కింది మార్గంలో రైలు వెళ్లేందుకు పట్టాలు.. దానిపైన రోడ్డు నిర్మించారు. అపురూపమైన ఈ రవాణా సౌకర్యం అందరినీ ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. గోదారమ్మ సాక్షిగా బస్సులోనో.. రైలులోనో గమ్మం చేరే మధురాభూతుల ప్రయాణానికి మార్గం ఏర్పడింది. మనదేశంలో రెండో అతిపెద్ద రోడ్డు కం రైలు ప్రయాణ వారధి ఇదే. 49 ఏళ్ల ఈ చారిత్రాత్మక వంతెన నాణ్యత పరిరక్షణ ఇప్పుడు సవాలుగా నిలిచింది. వయో భారం పెరగడంతో ఎక్కువ వాహనాలను ఈ వంతెనపై అనుమతించాలాంటే సందేహించాల్సి వస్తోంది. అందుకే ముందు జాగ్రత్తగా భారీ వాహనాలను అనుమతించకూడదని అధికారులు తాజాగా నిర్ణయించారు. నిర్మాణం ఇలా: గోదారమ్మ వడ్డాణం ధరించిందా అన్నట్టుటుంది రైలు కం రోడ్డు వంతెన. ఈ వంతెనపై ప్రయాణమంటే ఇష్టం లేని వారే ఉండరు. ఇప్పటికీ బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రాజమహేంద్రవరం వస్తుందనగానే అందరి కళ్లూ ఉరకలేసే గోదారిని చూడాలని ఆరాటపడతాయి. ఆనందానుభూతులను మనసులో నింపుకొంటారు. చెన్నై–హౌరా మధ్య రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ వారధి నిర్మాణం తెరపైకి వచ్చింది. 1964లో ప్రారంభమైన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక దశాబ్దం పట్టింది. జపాన్‌లో కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 1994లో 3.7 కిలోమీటర్ల పొడవున నిర్మించిన స్కైగేట్ బ్రిడ్జి తర్వాత పెద్ద వంతెన ఇదే కావడం విశేషం. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మూడు జాతీయ సంస్థలు ఈ వంతెన నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. 1974 నవంబర్ 20 అప్పటి రాష్ట్రపతి ప్రకృద్ధీన్ ఆలీ అహ్మద్ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అరవై ఐదేళ్లు కనిష్టం, ఎనభై ఏళ్లు గరిష్టంగా మనగలిగేలా వారధిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ వారధి ఉభయ గోదావరి సమైక్య వాహినిగా ఖ్యాతినార్జించింది. ఇప్పుడేమైంది: నిర్మాణ సమయంలో అనుకున్న అంచనాలకు మించి తర్వాత ఈ వారధిపై రాకపోకలు జరుగుతున్నాయి. రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయని అంచనా. రవాణా అవసరాలు పెరిగిపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. సరకు రవాణాకూ ఈ మార్గాన్నే అనుసరించేవి. ఫలితంగా వాహనాల రద్దీ భారీగా పెరిగింది. వారధికి భారంగా పరిణమించింది. దీంతో 49 ఏళ్లకే వంతెన మార్గం ప్రమాదంలో పడింది. 2007, 2011లలో దీనిని నిపుణులు పరిశీలించారు. మూడు ఆక్సిల్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాహనాలు, లేదా 10.20 టన్నుల బరువుకు మించిన వాహనాలు ఈ మార్గంలో వెళ్లడం సరికాదని సూచించారు. దీంతో అధికారులు వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. నిర్లక్ష్యానికి మూల్యం క్షేత్ర స్థాయిలో వంతెనపై భారీ వాహనాకు సంబంధించిన రూపొందించిన నిషేధాజ్ఞలు సక్రమంగా అమలు కాలేదు. 2010లో రాజమహేంద్రవరం ట్రాఫిక్ పోలీసుల ఉదాశీన వైఖరిని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఎస్సైతో పాటు దిగువ స్థాయిలోని పదిమంది సిబ్బందిని అప్పట్లో సస్పెండ్ చేశారు. తర్వాత నిబంధనల అమలుకు వంతెన మార్గానికి అటు ఇటు పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. తర్వాత సిబ్బంది కొరత కారణంగా ఎత్తివేశారు. దీంతో భారీ వాహనాల నియంత్రణపై పర్యవేక్షణ కొరవడింది. అధికారులు ఇటీవల వంతెన భద్రతను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఇరువైపులా నిషేధాజ్జలు అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 23 నుంచి భారీ వాçహనాల నియంత్రణపై కలెక్టర్ మాధవీలత గట్టి ఆంక్షలు విధించారు. రెండు వైపులా పోలీసు పికెట్లను పునరుద్ధరించారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వంటివి మాత్రమే అనుమతిస్తున్నారు. సామాన్య ప్రజలకు అసౌకర్యం కలగకుండా పల్లెవెలుగు బస్సులను అనుమతిస్తున్నారు. రూ.36 కోట్లతో మరమ్మతులు ఈ వంతెనపై 1996 నుంచి ఇప్పటివరకూ అడపాదడపా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కానీ అవి నిలవడం లేదు. ఇటీవల ఆర్అండ్బీ అధికారులు ఈ వంతెన మార్గానికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రూ.36 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. రూ.24 కోట్ల వ్యయంతో గడ్డర్ల మార్పిడి, పుట్‌ఫాత్ నిర్మాణం, శ్లాబులు వేయడం, హ్యాండ్ రైలింగ్ వంటి పనులు ఇందులో చేపడతారు. ఈ మొత్తంలో రూ.3 కోట్లు మాత్రమే రైల్వే శాఖ వాటాగా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తంతో జాయింట్ల మరమ్మతులు, రోడ్డు నిర్మాణం, సెకండరీ జాయింట్ మరమ్మతులు, లైటింగ్ ఏర్పాటు, క్రోకడయిల్ జాయింట్ మరమ్మతులు చేపట్టాలని సంకల్పించారు. అత్యవసరంగా రూ.2.10 కోట్ల వ్యయంతో వారధికి ప్రత్యేక మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అప్రోచ్ రోడ్లను కూడా పునరుద్ధరించనున్నారు. ఈ పనులకు టెండర్లు పిలిచారు. -
వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ సంబరాలు
వాషింగ్టన్ : అమెరికాలోని మేరీలాండ్ ఎల్లికాట్ సిటీలో వారధి ఆధ్వర్యంలో సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.కివానిస్ వల్లాస్ హాల్లో 400 మంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలోని ప్రతి చిన్న ఘట్టాన్ని వారధి సభ్యులు అత్యంత శ్రద్ధతో నిర్వహించారు. తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను ముందు తరాలకు అందచేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీర్చి దిద్దటం జరిగింది. మంత్రోచ్చారణతో కూడిన జ్యోతి ప్రజ్వలన, అనంతరం మన సంక్రాంతి సంప్రదాయాలతో ముగ్గుల పోటీలను నిర్వహించగా మహిళలు అంత్యంత ఉత్సాహం తో పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారధి ప్రెసిడెంట్ పుష్యమి దువ్వూరి, శ్రీధర్ కమ్మదనం, వెంకట్ గాలి, అశోక్ అన్మల్శెట్టి, మారుతి కంభంపతి, సురేష్ బొల్లి, జెరల్ సెక్రటరీ సుమా ద్రోణం, చైర్మన్ కిరణ్ కదాలి తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు రాజకీయ సమాధి తప్పదు
విజయవాడ సెంట్రల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో లాలూచీ పడ్డ చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కనకదుర్గ వారధి జాతీయ రహదారిపై శనివారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. విష్ణు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్షాలు చేపట్టిన బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ జనరల్ సెక్రటరీలు ఎం.రాజేశ్వరరావు, టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్.శాంతిభూషణ్, ఆకుల శ్రీనివాసకుమార్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఉపాధ్యక్షులు ఖుర్షీదా, సేవాదళ్ చైర్మన్ భవానీ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు. పార్టీల సమస్య కాదు.. రాష్ట్ర సమస్య విజయవాడ (బస్‌స్టేçÙన్) : ఇది పార్టీల సమస్య కాదు, రాష్ట్ర సమస్య అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేష్ అన్నారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా పండిట్‌నెహ్రూ బస్‌స్టేçÙన్ వద్ద వైఎస్సార్ సీపీ, సీపీఏం, సీపీఐ, సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హోదా కోసం పోరాడాలని చెప్పారు. సీపీఏం నగర కార్యదర్శి కాశీనాథ్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడీ శంకర్, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి కె. పోలారి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మద్దా శివశంకర్, దామోదర్, నేతలు కమ్మరి నాగేశ్వరరావు, కొమిరి వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. బస్‌స్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్న సీపీఏం, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులను అరెస్ట్ చేసి తోటవల్లూరు పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. -
అక్కడ... ప్రయోగాలెక్కువ!
‘‘కొంత విరామం తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రం ‘వారధి’. కథ బాగా నచ్చి, ఈ చిత్రం ఒప్పుకొన్నా. తెలుగమ్మాయిని అయినా ప్రస్తుతం తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. వరుసగా మంచి అవకాశాలు రావడంతో అంగీకరిస్తున్నా. తమిళంలో ప్రయోగాత్మక చిత్రాలెక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అక్కడ స్టార్స్‌తో తీసే సినిమాలనూ ఆదరిస్తారు.. కొత్తవాళ్లు నటించినవీ అంగీకరిస్తారు. లక్కీగా ఇప్పటివరకూ నేను అక్కడ చేసినవన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. రిలాక్స్ అవడానికి కూడా తీరిక లేనంత బిజీ. అంతా ఆ దేవుడి ఆశీర్వాదమే’’. - శ్రీదివ్య -
'వారధి' మూవీ స్టిల్స్
-
డాక్టర్ చదివినా యాక్టర్‌గా...
‘‘చిన్నప్పట్నుంచీ హీరో అవ్వాలన్నది నా లక్ష్యం. అమ్మా, నాన్న మాట కాదనలేక ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత నటనలో శిక్షణ తీసుకోవడం కోసం ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గర చేరాను. అప్పుడే ‘మల్లెల తీరంలో సిరి మల్లెపువ్వు’ చిత్రానికి అవకాశం వచ్చింది’’ అని క్రాంతి అన్నారు. ఆ తర్వాత ‘ఆ ఐదుగురు’లో నటించిన క్రాంతి, రేపు విడుదల కానున్న ‘వారధి’లో నటించారు. సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రాంతి మాట్లా డుతూ - ‘‘ఇందులో నాది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర. నటుడిగా నాకు సవాల్‌లాంటి పాత్ర కాబట్టే, ఎంచుకొన్నా. హీరో, హీరోయిజమ్ అనే తరహా పాత్రలు మాత్రమే చేయాలనుకోవడంలేదు. పూర్తిగా నటనకు అవకాశం ఉన్న లీడ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ప్రస్తుతం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’ చిత్రంలో నటిస్తున్నాననీ, డాక్టర్‌గా చదివినా యాక్టర్‌గా కొనసాగాలన్నది తన ఆశయం అని క్రాంతి తెలిపారు. -
ఇలా కూడా లవ్ చేయొచ్చా!
ఓ అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీ దివ్య, హేమంత్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చేలా ఈ సినిమా రూపొందించాం’’ అని చెప్పారు. శ్రీ దివ్య మాట్లాడుతూ -‘‘ఒక అమ్మాయి లవ్ చేస్తే ఎంత గాఢంగా లవ్ చేస్తుందో నా పాత్ర తెలియజేస్తుంది. అసలు ఇలా కూడా లవ్ చేయవచ్చా అని చూసినవాళ్లకు అనిపిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇందులో నేను శాడిస్ట్ లక్షణాలున్న పాత్ర చేశాను. ఓ ఫీల్ గుడ్ మూవీలా అందరికీ గుర్తుండిపోతుంది’’ అని క్రాంతి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ గొర్తి, సాహిత్యం: చైతన్య వర్మ. -
ప్రేమకు వారధి ఎవ రు?
ఇద్దరు యువకులు ఒక అమ్మాయినే ప్రేమించారు. మరి ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది...? చివరికి ఎవరి ప్రేమకు ఎవరు వారధిగా నిలిచారనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘వారధి’. క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ ముఖ్యతారలుగా ఇమాజినేషన్స్ పతాకంపై వివేకానంద వర్మ నిర్మించారు. సతీష్ కార్తికేయ దర్శకుడు, ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో క్రాంతి సైకో పాత్ర చేశారు. విజయ్ గొర్తి అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చైతన్య వర్మ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. -
తెలుగమ్మాయి!
-
స్వచ్ఛమైన ప్రేమకథ
క్రాంతి, శ్రీదివ్య, హేమంత్ హీరో హీరోయిన్లుగా సతీష్ కార్తికేయ దర్శకత్వంలో వివేకానంద వర్మ నిర్మించిన చిత్రం ‘వారధి’. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు జీవీ రామరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మంచి కథాంశంతో ఈ చిత్రం చేశాం. దర్శకునిగా తొలి చిత్రమైనప్పటికీ చిత్రబృందం అందించిన సహకారం వల్ల అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం. త్వరలో పాటలను, ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. నలుగురి బాధలో సంతోషం వెతుక్కునే ఓ యువకుడు, నలుగురి సంతోషాన్ని కోరుకునే ఓ యువతి మధ్య జరిగే ప్రేమకథ ఇదని క్రాంతి చెప్పారు. క్రాంతి, దివ్య, నేనూ కలిసి నటించిన ఎమోషనల్ జర్నీ ఈ సినిమా అని హేమంత్ అన్నారు. మానవీయ విలువలు ఎలా ఉండాలనే అంశానికి వాణిజ్య అంశాలు జోడించి, తీసిన స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిదని శ్రీదివ్య చెప్పారు. మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు విజయ్ గొర్తి అన్నారు.