అరకోటి ఇస్తే ఓకే | Sri Divya demands 50 lakh per film | Sakshi
Sakshi News home page

అరకోటి ఇస్తే ఓకే

Published Wed, Feb 25 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

అరకోటి ఇస్తే ఓకే

అరకోటి ఇస్తే ఓకే

అరకోటి కొట్టు కాల్ షీట్స్ పట్టు ఇది యువ నటి శ్రీ దివ్య తాజా స్లోగన్ అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇంకా చాలా షరతులున్నాయట. అవేమిటో తెలుసుకోవాలనుందా? కోలీవుడ్‌లో ఈ అమ్మడి కెరీర్ బ్రహ్మాండమైన విజయంతో మొదలైంది. శివకార్తికేయన్‌తో శ్రీ దివ్య నటించిన వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తరువాత విడుదలైన జీవా చిత్రం ప్రజాదరణ పొందింది. ఈ మధ్య విక్రమ్ ప్రభుతో జతకట్టిన వెళ్లక్కార దురై విజయం సాధించింది. ఇలా వరుసగా నటించిన మూడు చిత్రాలు సక్సెస్ అవ్వడంతో శ్రీదివ్య ఊహలతోపాటు ఆశలకు రెక్కలొచ్చేశా యి. ప్రస్తుతం ఆమె చేతిలో మరో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి.
 
  ఇప్పటి వరకు శివకార్తికేయన్, విష్ణు విశాల్ , జి.వి.ప్రకాష్, విక్రమ్ ప్రభు లాంటి వర్ధమాన హీరోలతోనే జతకట్టడంతో ఇప్పుడిక స్టార్ హీరోల సరసన నటించాలనే ఆశ పెరుగుతోందట. దీంతో చిన్న హీరోల అవకాశాలకు కాల్‌షీట్స్ లేవంటూ నిరాకరిస్తోందట. ఇక ఆమె పెడుతున్న షరతుల విషయానికొస్తే చిన్న హీరోల చిత్రాలైతే స్టార్ దర్శకులైనా ఉండాలని, ప్రముఖ హీరోల చిత్రాలైతే యువ దర్శకులైనా ఫర్వాలేదని అంటోందట. తాజాగా మలయాళ చిత్రం బెంగళూర్ డేస్ తమిళం, తెలుగు భాషల రీమేక్‌లో ఆర్య సరసన నటించే లక్కీ ఛాన్స్ శ్రీదివ్యను వరించింది. అంతకుముందు తెలుగులో బస్టాప్ వంటి విజయవంతమైన చిత్రంలో నటించడంతో ద్విభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో ఈ భామ పారితోషికాన్ని పెంచేసిందట. ఈమె శివకార్తికేయన్‌తో రెండో సారి నటించిన కాకిసట్టై ఈ నెల 27న తెరపైకి రానుంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement