
అవన్నీ వదంతులే
ప్రస్తుతం అదృష్టం వెంటాడుతున్న యువ కథనాయికల్లో నటి శ్రీదివ్య ఒకరు. కోలీవుడ్‌లో తొలి చిత్రమే (వరుత్త పడదా వాలిభర్ సంఘం) శత దినోత్సవ చిత్రంగా ఈ బ్యూటీకి అమరింది. ఆ తర్వాత మరో చిత్రం తెరపైకి రాలేదు. అయినా ఈ భామకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడుతుండడం విశేషం. సక్సెస్ పవర్ ఏమిటో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీదివ్య సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సరసన పెన్సిల్, అధర్వకు జంటగా ‘ఈటి’, శివకార్తికేయన్‌తో ‘తాణా’ విష్ణు విశాల్‌కో జోడిగా ‘జీవా’, విక్రమ్ ప్రభుకు జంటగా ‘వెళ్ళైక్కారదురై’, విమల్ సరసన ‘కాట్టుమల్లి’, నగర్‌పురం అంటు ఏక కాలంలో సప్త చిత్రాలతో యమ బిజీగా ఉన్న శ్రీ దివ్యపై పలు వదంతులు ప్రచారం అవుతున్నాయి.
ముఖ్యంగా పారితోషికం పెంచేశారని, నిర్మాతని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని శ్రీదివ్య ఖండిస్తున్నారు. అవన్నీ వదంతులేనంటున్న ఈ లక్కీ గర్ల్ మాట్లాడుతూ, తాను చాలా శ్రమ జీవినన్నారు. తానెలాంటి అమ్మాయినో తన నిర్మాతలకు బాగా తెలుసన్నారు. వృత్తిపరంగా తన పని తాను కరెక్ట్‌గా చేసుకుపోతానని చెప్పారు. ఏ నిర్మాతనూ తాను ఇబ్బంది పెట్టింది లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు ఎందుకు ప్రచా రం చేస్తున్నారో అర్థం కావడం లేదని నటి శ్రీదివ్య వాపోతున్నారు.