
సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ (G. V. Prakash Kumar)- సింగర్ సైంధవి (Saindhavi)ల విడాకులను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరంభం నుంచి ఒకరికోసం ఒకరు తోడుగా నిలబడ్డ ఈ దంపతులను ఇకపై జంటగా చూడలేమన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదే సమయంలో జీవీ ప్రకాశ్.. హీరోయిన్ దివ్య భారతి (Divya Bharathi)తో ప్రేమలో పడ్డాడన్న ప్రచారం జరుగుతోంది.
హీరోయిన్‌తో లవ్ రూమర్స్..
ఈ పుకార్లపై జీవీ ప్రకాశ్ పెదవి విప్పాడు. అతడు మాట్లాడుతూ.. మేము బ్యాచిలర్ సినిమా కోసం కలిసి పని చేశాం. అంతమాత్రానికే మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని జనాలు ఏవేవో ఊహించుకుంటున్నారు. అది నిజం కాదు. ఒకరితో మరొకరికి ఏ సంబంధమూ లేదు. కేవలం సాధారణ స్నేహితులం మాత్రమే. సినిమా షూటింగ్ అయ్యాక ఒక్కసారి కూడా కలుసుకోలేదు. మళ్లీ ఇలా ప్రమోషన్స్‌లో మాత్రమే కలుసుకున్నాం అని చెప్పాడు. దివ్య భారతి మాట్లాడుతూ.. జీవీ ప్రకాశ్ భార్యకు విడాకులివ్వడానికి నేనే కారణమని చాలామంది మెసేజ్‌లు పెడుతూనే ఉన్నారు. ఈ విషయంలో నన్ను టార్గెట్ చేస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తనతో నాకెలాంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చింది.
వైవాహిక జీవితానికి ముగింపు
జీవీ ప్రకాశ్- సైంధవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో దాంప్యత బంధంలోకి అడుగుపెట్టిన వీరు 2020లో కూతురికి జన్మనిచ్చారు. పదకొండేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024లో విడిపోతున్నట్లు ప్రకటించారు. సినిమాల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్, దివ్య భారతి 'కింగ్‌స్టన్' మూవీ కోసం మరోసారి జతకట్టారు. బ్యాచిలర్ సక్సెస్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఈ మూవీ మార్చి 7న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment