తెలుగమ్మాయి శ్రీదివ్య
యువ సంగీత దర్శక తరంగం జి.వి.ప్రకాష్‌కుమార్ హీరో అవతారమెత్తనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి పెన్సిల్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. మణి నాగరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో గూండా చట్టాన్ని వాడుకోలేకపోయాం. హీరోయిన్గా మొదట ప్రియా ఆనంద్‌ను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడామెకు బదులు శ్రీదివ్యను ఎంపిక చేశారు.
ఈ పదహారణాల తెలుగమ్మాయి ఇటీవల వరుత్తపడాద వాలిభర్ సంగం చిత్రం ద్వారా కోలీవుడ్లోకి ప్రవేశించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో శ్రీదివ్యపై దర్శక నిర్మాతల దృష్టి పడింది. తాజాగా ఈమె పొందిన అవకాశం పెన్సిల్ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ తొలి వారంలో ప్రారంభం కానుందని జి.వి.ప్రకాష్‌కుమార్ తెలిపారు.
ఈ నెలాఖరున జీవీ, శ్రీదివ్యలకు ఫొటో షూట్ నిర్వహించనున్నారట. తాను విద్యాభ్యాసం చేసిన శెట్టినాడు విద్యాశ్రమంలో షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటున్నట్లు జీవీ తెలిపారు. ఇందులో తాను ప్లస్-2 విద్యార్థిగా నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.