
త్రిష్నా, హరీష్ శంకర్, శ్రీవిద్య, నవదీప్
రాహుల్, త్రిష్నా ముఖర్జీ జంటగా నటించిన చిత్రం ‘మధ’. ఇందిరా బసవ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీవిద్య దర్శకురాలు. ఈ నెల 13న విడుదలవుతున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘యంగ్ ఏజ్‌లో అందరూ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఈ చిత్రదర్శకురాలు శ్రీదివ్య మాత్రం డబ్బులు పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఆమెలో చాలా ప్యాషన్ కనిపించింది’’ అన్నారు. నవదీప్ మాట్లాడుతూ– ‘‘శ్రీవిద్య నాకు ఫేస్‌బుక్ ఫ్రెండ్.
నేనీ సినిమా చూశాను. నెక్ట్స్ లెవల్ మూవీ అని ఓ ప్రేక్షకునిగా చెప్పగలను. ఈ సినిమాను ఓ పెద్ద హీరోయిన్‌తో చేయమంటే తన టీమ్ కోసం ఆమె ఒప్పుకోలేదు’’ అన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ– ‘‘నా మూడేళ్ల కల ఇది. ‘మధ’ ప్యారలల్ మూవీ అనొచ్చు. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో తీసిన ఈ చిత్రం ప్రతి అమ్మాయికి నచ్చుతుంది’’ అన్నారు. ‘‘శ్రీవిద్య కాన్సెప్ట్ చెప్పగానే, సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్‌కి కనెక్ట్ అయ్యాను అన్నారు’’ త్రిష్నా.
Comments
Please login to add a commentAdd a comment