చీరకట్టులో శ్రీదివ్య
చీరకట్టుతో మెచ్యూరిటీని, మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌ను ప్రదర్శిస్తూ నటిగా ప్రమోషన్ పొందిన ఆనందంలో మునిగి తేలుతోందట నటి శ్రీదివ్య.
చీరకట్టుతో మెచ్యూరిటీని, మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌ను ప్రదర్శిస్తూ నటిగా ప్రమోషన్ పొందిన ఆనందంలో మునిగి తేలుతోందట నటి శ్రీదివ్య. ఈ తెలుగు భామ వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్‌లో ప్రవేశించింది. ఈ చిత్రంలో పాఠశాల విద్యార్థినిగా అందరినీ ఆకట్టుకుంది. చిత్రం ఘన విజయం సాధించడంతో అమ్మడికి గిరాకీ పెరిగింది. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా పెన్సిల్ పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటించే అదృష్టం ఈ బ్యూటీకే దక్కింది. ఇందులో శ్రీదివ్య పాఠశాల విద్యార్థినిగానే నటిస్తోందట.
అంతేకాదు మరికొందరు దర్శక నిర్మాతలు పాఠశాల విద్యార్థిని పాత్రలతో కూడిన కథ వినిపించడంతో అన్ని ఆ తరహా పాత్రలేనా అంటూ నిరాశకు లోనయ్యిందట. కళాశాల విద్యార్థినిగా ప్రమోషన్ కోసం ఎదురుచూసిన ఈ చిన్నదానికి తాజాగా ఈ చిత్రంలో తను ఆశించిన కళాశాల విద్యార్థిని పాత్రే లభించిందట. నటిగా తన కెరీర్ ప్రమోషన్‌గా భావిస్తున్న శ్రీదివ్య ఈ చిత్రంలో తన వయసుకు మీరి మెచ్యూరిటీగా కనిపించడానికి కొన్ని సన్నివేశాల్లో చీర కట్టి నటించిందట. అలాగే పాటల సన్నివేశాల్లో మోడ్రన్ దుస్తుల్లో అందాలు ఆరబోయడానికి సిద్ధం అవుతోందట. దీంతో తనకు స్టార్స్ సరసన నటించే అవకాశాలు రావడం ఖాయమంటూ కలలు కంటోందట.