ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ! | Ram Gopal Varma Announce A Movie With Social Media Star Sri Lakshmi | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఒక్క వీడియో వైరల్.. ఏకంగా హీరోయిన్‌ను చేసేసింది!

Published Thu, Dec 21 2023 3:24 PM | Last Updated on Thu, Dec 21 2023 3:42 PM

Ram Gopal Varma Announce A Movie With Social Media Star Sri Lakshmi - Sakshi

సంచలన డైరెక్టర్‌ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది. రాం గోపాల్ వర్మ ట్వీట్‌ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. 

అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె కేరళకు చెందిన అమ్మాయిగా తెలిసింది. ఆర్జీవీ ఆ యువతి రీల్ షేర్ చేయడంతో ఆమెకు ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. ఆ యువతి పేరు శ్రీలక్ష‍్మి సతీశ్ అని తెలిసింది. ఆ తర్వాత ఆర్జీవీ తనను పొగిడారని ఆమె సంతోషం వ్యక్తం చేసింది కూడా. అయితే తాజాగా ఆర్జీవీ ఏకంగా ఆ యువతితో సినిమా తీసేందుకు రెడీ అయిపోయారు.  ఆమెతో శారీ అనే సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఏకంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.  

ఇది చూసిన అభిమానులంతా మొత్తానికి మన ఆర్జీవీ అనుకున్నంత పని చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో వైరల్‌ అయిన యువతిని.. ఏకంగా హీరోయిన్‌ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.  ఈ చిత్రం ద్వారానే శ్రీలక్ష‍్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫిక్సయినట్లే. ఆర్జీవీ డెన్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అఘోశ్ వైష్ణవం దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. కాగా.. ప్రస్తుతం రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం ఈ నెల 29న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement