‘నగరపురమ్’
బస్‌స్టాప్, మల్లెలతీరంలో... ఫేం శ్రీదివ్య, అఖిల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నగరపురమ్’. ఎన్.పి.సారథి దర్శకుడు. రావు అప్పారావు నిర్మాత. నిర్మాణానంతర పనులు పూర్తి కావచ్చిన ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘గతంలో వచ్చిన కాలేజ్ నేపథ్య చిత్రాలకు ఇది పూర్తి భిన్నమైన చిత్రం.
అన్నదమ్ముల మధ్య సాగే సంఘర్షణ ఈ చిత్రానికి హైలైట్’’ అని చెప్పారు. కంటతడి పెట్టించే సన్నివేశాలతో పాటు కడుపుబ్బ నవ్వించే హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేకతని, ఈ నెలలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాణ నిర్వాహణ: జి.కోటేశ్వరరావు, ఎ.నాగరాజ్, సమర్పణ: ఎం.వి.నారాయణ, సహ నిర్మాత: ప్రదీప్‌కుమార్ ఆర్.ఎం., నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్.