నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు | Sri Divya Exclusive Interview | Sakshi
Sakshi News home page

నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు

Published Fri, Feb 26 2016 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు

నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు

నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదని తెగ ఇదైపోతోంది నటి శ్రీదివ్య. అదృష్టం అంటే ఈ అమ్మడిదే అనక తప్పదు. వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రంతో కోలీవుడ్ తెరపై మెరిసిన ఆంధ్రా పోరి శ్రీదివ్య. ఆ తరువాత జీవా, కాక్కీసట్టై చిత్రాల విజయాలతో హీరోయిన్‌గా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఈ బ్యూటీ గ్లామర్ జోలికి పోకుండా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలను చేతిలో పెట్టుకున్న శ్రీదివ్య ఇటీవల విడుదలైన బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో చక్కని అభినయంతో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఈ సక్కనమ్మతో చిన్న చిట్‌చాట్..
 
 ప్ర: తెలుగమ్మాైయై ఉండి పూర్తిగా తమిళ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారు. అక్కడ అవకాశాలు రావడం లేదా?
 జ: నేను బాల నటిగా పరిచయమైంది తెలుగులోనే. హీరోయిన్ స్థాయికి ఎదిగిందీ అక్కడే. అయితే నాకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెడుతున్నది తమిళసినిమానే. నాలోని నటనా ప్రతిభను చాటుకునే విధంగా మంచి కథా పాత్రలతో కూడిన అవకాశాలు ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే ఇతర భాషా చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదు.
 
 ప్ర: బెంగళూర్ నాట్కళ్ చిత్రంలో తొలిసారిగా డబ్బింగ్ చెప్పినట్టున్నారు?
 జ: తెలుగులో నేను నటించిన అన్ని చిత్రాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను. తమిళంలో జీవా, కాక్కీసట్టై చిత్రాలకు డబ్బింగ్ చెప్పాలని ఆశించాను. అయితే వాయిస్ టెస్ట్ తెలుగు యాస తెలుస్తోందని రిజెక్ట్ చేశారు. దాంతో స్వచ్ఛమైన తమిళ భాష ఎలా మాట్లాడాలన్నది నేర్చుకుని బెంగుళూర్ నాట్కళ్ చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను.
 
 ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
 జ: జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించిన పెన్సిల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు కార్తీ సరసన కాస్మోరా చిత్రం, విశాల్‌కు జంటగా మరుదు, జీవాతో ఒక చిత్రం చేస్తున్నాను.
 
 ప్ర: విశాల్ మీ కంటే చాలా హైట్. ఆయనకు జంటగా ఎలా మెయిన్‌టెయిన్ చేయగలుగుతున్నారు?
 జ: నిజమే నేను కాస్త పొట్టే. మంచి పొడుగైన విశాల్‌తో నటించడానికి స్టూల్ సాయం తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో మదురై యాసలో మాట్లాడి నటించడం వినూత్న అనుభవం అనే చెప్పాలి. తెలుగమ్మాయినైనా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకుని నటిస్తున్నాను.
 
 ప్ర: పారితోషికం కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట?
 జ: నేనిప్పటి వరకూ ఎవరి వద్దా పారితోషికం డిమాండ్ చేసింది లేదు. ప్రస్తుత నా స్థాయికి తగ్గ పారితోషికమే చెల్లిస్తున్నారు.
 
 ప్ర: లక్ష్మీమీనన్, కీర్తీసురేష్, నందిత, ఐశ్వర్యారాజేష్ లాంటి వారు కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. వారిని పోటీగా భావిస్తున్నారా?
 జ: ఒకే చిత్రంలో పలువురు హీరోయిన్లు నటిస్తే అప్పుడు వారి ప్రతిభను నిరూపించుకోవడానికి పోటీ ఉంటుంది. అప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది. అయితే నేనెవరినీ పోటీగా భావించడం లేదు.
 
 ప్ర: ప్రేమ వివాహమే చేసుకుంటానని అంటున్నార ట. ఎవరినైనా ప్రేమించారా?
 జ: కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా. అయితే నేను ప్రేమించే వ్యక్తిని ముందుగా నా తల్లిదండ్రులకు పరిచయం చేసి వారి అభిప్రాయాన్ని అడుగుతాను. వారికి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ప్రేమించారా? అని అడుగుతున్నారు. నేను నటినైన తరువాత ఇప్పటి వరకూ నాకెవరూ ఐ లవ్ యూ చెప్పలేదు. నేనెవరితోనూ అంతగా కలివిడిగా మాట్లాడను. నాతో మాట్లాడడానికి భయం కారణంగానే బహుశా ఎవరూ ఐ లవ్యూ చెప్పడానికి సాహసించడం లేదేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement