
ఆమె శ్రీదివ్య కాదు.. దివ్యశ్రీ!
ఇటీవల గుంటూరులో వ్యభిచార రాకెట్లో ఓ హీరోయిన్ పట్టుబడింది. కొన్ని మీడియా వర్గాల్లో ఇలా పట్టుబడిన నటి పేరు శ్రీదివ్య అని వచ్చింది. కానీ, వాస్తవానికి అక్కడ పట్టుబడిన నటి దివ్యశ్రీ అని పోలీసు వర్గాలు తెలిపాయి. బీటెక్ బాబు సినిమాలో నటించిన హీరోయిన్ దివ్యశ్రీ కాగా.. బస్ స్టాప్ సినిమాతో ఫేమ్లోకి వచ్చిన నటి శ్రీదివ్య. వీరిద్దరి పేర్ల మధ్య ఉన్న సారూప్యత కారణంగా ఇద్దరి పేర్ల విషయంలో కొంత గందరగోళానికి గురై.. ఒకరి బదులు మరొకరి పేరును ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.
గుంటూరు జేకేసీ కాలేజి రోడ్డు సమీపంలోని స్వర్ణభారతి నగర్ ప్రాంతంలో ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు గుంటూరు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో వాళ్లు వెళ్లి అక్కడ సోదాలు చేసి.. దివ్యశ్రీని అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మరో చిత్రంలో నటిస్తోంది. ఇంటి యజమానిని కూడా తాము అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ సోదాల్లో పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వాళ్లు బ్రోకర్లుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.