divya sri
-
సాఫ్ట్వేర్ సత్యభామ
సాక్షి,సిటీబ్యూరో: రాజమండ్రి నుంచి సిటీకి వచ్చిన ఓ అమ్మాయి నేపథ్యంలో జరిగే కథ ‘సాఫ్ట్వేర్ సత్యభామ’. లీడ్‌రోల్‌గా దివ్యశ్రీ గురుబెల్లి నటించారు. తమాడా వెబ్‌సిరీస్‌లో రిలీజ్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటంది. వారం రోజుల్లో 3 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. దివ్యశ్రీ పల్లెటూరు నుంచి వచ్చి సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. బాయ్స్‌కి దూరంగా ఉంటుంది. ఎవరైనా పలకరిస్తే ‘నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడంటూ’ తప్పించుకుంటంది. సిగరెట్ తాగే అలవాటున్న తన కొలీగ్ ఒకరోజు కళ్లు తిరిగి పడిపోతుంది. ఆమెకు దివ్యశ్రీ పంచదార కలిపిన నీళ్లు తాగిస్తుంది. వెంటనే కిందపడిన అమ్మాయి ఫ్రెండ్స్ అంటూ అడుగుంది. దీంతో సత్యభామ స్మోక్ మానేస్తే ఫ్రెండ్షిప్ చేస్తా’నంటుంది. ఇలా ఓ మంచి మెసేజ్తోరూపొందించిన ‘సాఫ్ట్వేర్ సత్యభామ’ యూట్యూబ్‌లో యూత్‌కు బాగా చేరువుతోంది. ‘వరంగల్ వందన’ వైరల్ సోషల్ మీడియా పుణ్యమా అని గల్లీలో ఉండేవారు సైతం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాస్తంత క్రియేటివిటీ ఉంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ కూడా వచ్చేస్తుంది. అందుకు ‘షార్ట్‌ఫిల్మ్స్’ చక్కని వేదికవుతోంది. సినిమా రంగంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ తమ టాలెంట్‌ని వీటి ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నారు. ఈకోవలోనే వరంగల్ నేపథ్యంలో వస్తున్న షార్ట్‌ఫిల్మ్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇందులో సిటీకి చెందిన ఐశ్వర్యారెడ్డి ‘వరంగల్ వందన’గా తెగ సందడి చేస్తోంది. ‘టెన్త్ రిజల్ట్స్, వందన వార్డెన్, అప్పగింతలు, ఇంటర్పోరి, ఆటోవాలా, హోంసిక్’ వంటి సిరీస్ యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. శ్రీకాంత్ ఇప్పా డైరెక్టర్ చేస్తున్న ఈ వీడియోస్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. దసరా సందర్భంగా రూపొందించిన ‘ధూం..ధాం దసరా, మన ఊరి బతుకమ్మ’ వంటి వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్, హిట్స్‌తో ట్రెండ్‌ని సృష్టిస్తున్నాయి. -
ఆమె శ్రీదివ్య కాదు.. దివ్యశ్రీ!
ఇటీవల గుంటూరులో వ్యభిచార రాకెట్లో ఓ హీరోయిన్ పట్టుబడింది. కొన్ని మీడియా వర్గాల్లో ఇలా పట్టుబడిన నటి పేరు శ్రీదివ్య అని వచ్చింది. కానీ, వాస్తవానికి అక్కడ పట్టుబడిన నటి దివ్యశ్రీ అని పోలీసు వర్గాలు తెలిపాయి. బీటెక్ బాబు సినిమాలో నటించిన హీరోయిన్ దివ్యశ్రీ కాగా.. బస్ స్టాప్ సినిమాతో ఫేమ్‌లోకి వచ్చిన నటి శ్రీదివ్య. వీరిద్దరి పేర్ల మధ్య ఉన్న సారూప్యత కారణంగా ఇద్దరి పేర్ల విషయంలో కొంత గందరగోళానికి గురై.. ఒకరి బదులు మరొకరి పేరును ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు జేకేసీ కాలేజి రోడ్డు సమీపంలోని స్వర్ణభారతి నగర్ ప్రాంతంలో ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార రాకెట్ నడుపుతున్నట్లు గుంటూరు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో వాళ్లు వెళ్లి అక్కడ సోదాలు చేసి.. దివ్యశ్రీని అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమె మరో చిత్రంలో నటిస్తోంది. ఇంటి యజమానిని కూడా తాము అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ సోదాల్లో పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. వాళ్లు బ్రోకర్లుగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. -
కోలీవుడ్‌కు సిండియన్ యువతి
సిండియన్ యువతి హీరోయిన్గా కోలీవుడ్కొస్తున్నారు. మలేషియాలో నివసించే భారతీయుడికి మలేషియా స్త్రీకి కలిగిన సంతతిని సిండియన్ అంటారు. అలాంటి సంతతికి చెందిన దివ్యశ్రీ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కలర్ కన్నాడిగళ్ అని చిత్ర దర్శకుడు తెలిపారు. మిత్రాస్ స్టూడియోస్ పతాకంపై వ్యాపారవేత్త వీర విశ్వామిత్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రవి రాహుల్ పేరుతో ఆత్తా ఉన్ కోయిలిలే, మిట్టా మిరసు, మాంగల్యం తంతు నానే చిత్రాల్లో హీరోగా నటించారు. రవి రాహుల్ తన పేరును రాహుల్‌గా మార్చుకుని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కలర్ కన్నాడిగళ్. చిత్ర వివరాలను తెలుపుతూ నవ నటుడు అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మలేషియాలో పాడటానికి వెళ్లిన చెన్నై యువకుడు ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం మలేషియాలోనే చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు.