కోలీవుడ్‌కు సిండియన్ యువతి
సిండియన్ యువతి హీరోయిన్‌గా కోలీవుడ్‌కొస్తున్నారు. మలేషియాలో నివసించే భారతీయుడికి మలేషియా స్త్రీకి కలిగిన సంతతిని సిండియన్ అంటారు. అలాంటి సంతతికి చెందిన దివ్యశ్రీ నటిస్తున్న తొలి తమిళ చిత్రం కలర్ కన్నాడిగళ్ అని చిత్ర దర్శకుడు తెలిపారు. మిత్రాస్ స్టూడియోస్ పతాకంపై వ్యాపారవేత్త వీర విశ్వామిత్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు రవి రాహుల్ పేరుతో ఆత్తా ఉన్ కోయిలిలే, మిట్టా మిరసు, మాంగల్యం తంతు నానే చిత్రాల్లో హీరోగా నటించారు. రవి రాహుల్ తన పేరును రాహుల్‌గా మార్చుకుని తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కలర్ కన్నాడిగళ్. చిత్ర వివరాలను తెలుపుతూ నవ నటుడు అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మలేషియాలో పాడటానికి వెళ్లిన చెన్నై యువకుడు ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అన్నారు. చిత్ర షూటింగ్ మొత్తం మలేషియాలోనే చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు.