విష్ణువిశాల్‌తో మరోసారి శ్రీదివ్య
సక్సెస్‌ఫుల్ చిత్ర జంట కాంబినేషన్‌లో మరో చిత్రం అంటే దానికి తప్పకుండా క్రేజ్ ఉంటుంది. జీవా చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విష్ణువిశాల్, శ్రీదివ్య తాజాగా మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. జీవా చిత్ర షూటింగ్ సమయంలో ఈ జంట గురించి పలు వదంతులు ప్రచారం అయ్యాయి. కాగా నటుడు విష్ణువిశాల్, దర్శకుడు సుశీంద్రన్‌లది హిట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.
వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో విష్ణువిశాల్‌ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు సుశీంద్రన్ ఆ తరువాత ఆయనే హీరోగా జీవా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఈ కాంబినేషన్ మరో విజయానికి రెడీ అవుతోంది. నిజానికి సుశీంద్రన్ నటుడు ఉదయనిధి హీరోగా చిత్రం చేయాల్సింది. ఆ చిత్రం వాయిదా పడటంతో విష్ణువిశాల్‌తో చిత్రం ప్రారంభిస్తున్నారు. ఇందులో నాయకిగా ముందు మంజిమా మోహన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది.
చివరికి ఈ అవకాశం నటి శ్రీదివ్యను వరించింది. ఇది రొమాంటిక్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలంటున్నాయి. ఇందులో నటుడు పార్తీబన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 15న ప్రారంభం కానుంది. వేల్లైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విష్ణువిశాల్ నటిస్తున్న చిత్రం ఇదే.