కథానాయకన్‌గా విష్ణువిశాల్ | Vishnu Vishal to romance Catherine Tresa | Sakshi
Sakshi News home page

కథానాయకన్‌గా విష్ణువిశాల్

Published Wed, Nov 9 2016 4:25 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

కథానాయకన్‌గా విష్ణువిశాల్

కథానాయకన్‌గా విష్ణువిశాల్

యువ నటుడు విష్ణువిశాల్ హీరోగా చిత్ర చిత్రానికి తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా సుశీంద్రన్ దర్శకత్వంలో మా వీరన్‌కిట్టు చిత్రంలో నటిస్తున్నారు. శ్రీదివ్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. కాగా విష్ణువిశాల్ ఇటీవల వేలైయన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రంతో నిర్మాతగా కూడా మారి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తను హీరోగా నటిస్తూ రెండో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమయ్యారు.
 
  దీనికి కథానాయకన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది 1988లో పాండిరాజన్ హీరోగా ముక్తా శ్రీనివాసన్ నిర్మించిన చిత్రం పేరు కావడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి మురుగానందం దర్శకత్వం వహించనున్నారు. ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి క్యాథరిన్ ట్రెసా నటించనున్నారు. ఇది మంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌తో సాగే జనరంజక కథా చిత్రంగా ఉంటుందని, నిర్మాతగా తొలి విజయం సాధించిన విష్ణువిశాల్ ఈ చిత్రంంతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement