విష్ణు విశాల్‌తో క్యాథరిన్ రొమాన్స్ | Catherine Theresa Romance with vishnu Vishal | Sakshi
Sakshi News home page

విష్ణు విశాల్‌తో క్యాథరిన్ రొమాన్స్

Published Tue, Sep 20 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

విష్ణు విశాల్‌తో క్యాథరిన్ రొమాన్స్

విష్ణు విశాల్‌తో క్యాథరిన్ రొమాన్స్

 నటి క్యాథరిన్ ట్రెసా యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేస్తున్నారు. మెడ్రాస్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ చిత్ర విజయాన్ని పెద్దగా క్యాష్ చేసుకోలేక పోయారనే చెప్పాలి. విషయం ఏమిటంటే క్యాథరిన్ ట్రెసా ఆ తరువాత విశాల్‌కు జంటగా నటించిన కథకలి, అధర్వ సరసన నటించిన కణిధన్ చిత్రాలు విజయ బాటలోనే న డిచాయి. అయినా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఇక్కడ అంతంత మాత్రమే. అటు టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. ఒక రకంగా తమిళంలోనే కాస్త బెటర్. ప్రస్తుతం ఆర్యతో కంభన్ అనే చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
 
  తాజాగా నటుడు విష్ణు విశాల్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. నిజానికి ఇంతకు ముందే విష్ణు విశాల్‌తో క్యాథరిన్ ట్రెసా ఒక చిత్రం కమిట్ అయ్యారు. వీర ధీర శూరన్ పేరుతో గత ఏడాదే ప్రారంభమైన ఈ చిత్రానికి శకుని చిత్రం ఫేమ్ శంకర్ దయాళ్ దర్శకుడు. అయితే కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ఆగిపోయింది. ఆ చిత్ర కాల్‌షీట్స్‌ను విష్ణు విశాల్ తన తాజా చిత్రానికి వాడుకుంటున్నారట.
 
  ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని ఈయన తన సొంత నిర్మాణ సంస్థ డ బ్ల్యూ స్టూడియో స్ పతాకంపై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. ఇంతకు ముందు వేలైన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న విష్ణు విశాల్‌కు ఇది నిర్మాతగా రెండో చిత్రం. యోగానందం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. తనను హీరోగా పరిచయం చేసిన సుశీంద్రన్ దర్వకత్వంలో మావీరన్ కుట్టి చిత్రాన్ని పూర్తి చేసిన విష్ణువిశాల్ తాజాగా తన సొంత చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement