పెళ్లి వాహనం ఢీకొని వ్యక్తి మృతి | The vehicle hit and killed a man | Sakshi
Sakshi News home page

పెళ్లి వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Published Fri, Apr 29 2016 4:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The vehicle hit and killed a man

రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం రాంపూర్ గ్రామం వద్ద పెళ్లి కుమార్తె వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి పక్కనే ఉన్న మరో గ్రామ యువకుడితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వధువును గురువారం అర్ధరాత్రి సమయంలో కారులో బంధు, మిత్రుల నృత్యం మధ్య తీసుకెళుతున్నారు.

ఈ క్రమంలో డ్రైవర్ కారును నిలిపి కిందకు దిగి తాను కూడా డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు. ఇదే సమయంలో మద్యం సేవించి ఉన్న ఒక వ్యక్తి కారులోకి ఎక్కి దాన్ని ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. తిరుపతి అనే వ్యక్తిపైకి దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాములు, వెంకటయ్య అనే ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement