బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి | The father of the children on the road to leave the canopy | Sakshi
Sakshi News home page

బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి

Published Thu, Jun 18 2015 6:58 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి - Sakshi

బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి

తల్లి జాడ తెలియని వైనం  
టూటౌన్ పోలీసుల చొరవతో చైల్డ్‌లైన్ చెంతకు..


ఒంగోలు క్రైం: తల్లి వద్ద నుంచి తన ఇద్దరు కుమారులను రెండు నెలల క్రితం నెల్లూరులో ఉంటున్న తండ్రి తీసుకొని వెళ్లాడు. అంతవరకు బాగానే ఉంది. తిరిగి బిడ్డలను భార్య వద్ద వదిలి పెట్టకుండా ఆమె ఒంగోలులో లేకుండా చూసి ఓ సినిమా హాలు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఒంగోలు రైలుపేటలో నివాసం ఉంటున్న కగ్గా శ్రీను, నాగమణికి ఇద్దరు కుమారులు. కగ్గా గోపి (11), కగ్గా రాము(9). అయితే భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్లిన తండ్రి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాసా థియేటర్ వద్ద ఇద్దరు బిడ్డలను వదిలేసి, వారికి రూ.150 ఇచ్చి సినిమాకు వెళ్లమని చెప్పి  వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు థియేటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శీనప్ప, కానిస్టేబుల్ ఎస్‌కే మస్తాన్ వలి గమనించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలుపేటలోని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు.

అయితే ఇంటి వద్ద ఆ చిన్నారుల తల్లి నాగమణి లేదు. స్థానికులను విచారణ చేశారు. ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. దీంతో పోలీసులు చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11.30 గంటల సమయంలో సాగర్ వచ్చి ఆ చిన్నారులను బొమ్మరిల్లు హోంలో చేర్పించారు. బాలల సంక్షేమ మండలి ముందు బుధవారం హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను అదే హోంలో చేర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement