డీఎస్పీ ఆఫీసు ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం | someone to commit suicide in front of the DSP office | Sakshi
Sakshi News home page

డీఎస్పీ ఆఫీసు ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం

Published Tue, Oct 18 2016 3:36 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

someone to commit suicide in front of the DSP office

ఫిర్యాదును ఎస్‌ఐ పట్టించుకోవడంలేదని..
అనంతగిరి: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన  సోమవారం మధ్యాహ్నం జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన రాములుకు అదే గ్రామానికి చెందిన కొందరితో పదిరోజుల క్రితం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డాడు. ఈ విషయమై రాములు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే సంబంధిత ఎస్‌ఐ పట్టించుకోకుండా దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన రాములు సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు.

తన సమస్యను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లకుండానే అక్కడ సిబ్బంది చూస్తుండగా తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. గమనించిన సిబ్బంది విషయం డీఎస్పీ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములును చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement