swami
-
శబరిమల భక్తులకు ‘స్వామి చాట్‌బాట్’
శబరిమల దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భక్తులకు సమగ్ర సమాచారం అందించేలా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అందులో భాగంగా శబరిమల దర్శనార్థం వెళ్లేవారికి ‘స్వామి చాట్‌బాట్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేరళలోని పథనంథిట్ట జిల్లా అధికారులు తెలిపారు.ముత్తూట్ గ్రూప్‌తో కలిసి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఏఐ డిజిటల్ అసిస్టెంట్ ‘స్వామి’ అనే చాట్‌బాట్‌ను ప్రారంభించారు. శబరిమలకు రాకపోకలు సాగించే భక్తులు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు దీన్ని వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: వార్షిక వేతనం రూ.5 లక్షలు.. రూ.కోటి పాలసీ ఇస్తారా?రోజులవారీగా ఆలయ దర్శన సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు. ఈ చాట్‌బాట్‌ను ఇంగ్లిష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సిద్ధం చేశారు. శబరిమల దగ్గర్లోని చూడదగిన దేవాలయాల వివరాలు కూడా అందులో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. -
బంగ్లాదేశ్ సంక్షోభంపై అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. -
హత్య కేసులో నటుడు దర్శన్
-
ఆచరణే వేదాంత పరమలక్ష్యం: స్వామి బోధమయానంద
సాక్షి, హైదరాబాద్: నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రానికి 44 సంవత్సరాలుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. వైద్యులకు, రోగులకు మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గుర్తుచేశారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ స్మితా కోల్హే, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యుడు, డాక్టర్ సంతోష్ క్రాలేటి, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ రవీందర్ రావు, బేలూర్ మఠానికి చెందిన స్వామి సత్యేశానంద, ఈటానగర్ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, ముంబై రామకృష్ణ మిషన్ హాస్పిటల్‌కు చెందిన స్వామి దయాధిపానంద, వైద్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో -
శివానంద ‘యోగ’
-
గుండెపోటుతో ప్రభోదానందస్వామి మృతి
-
కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్ స్వామి (90) కన్నుమూశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు.1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించిన ఐడీ స్వామి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వెలిబుచ్చారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు.ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గతవారంమే స్వామి భార్య పద్మ కన్నుమూశారు. -
స్వామీజీ మహిళలను చూడగానే..!
జైపూర్: ఓ కార్యక్రమానికి హాజరైన స్వామిజీ మహిళా ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని ఉండడం చూసి, సభలో ప్రసంగించకుండానే వెనుదిరిగిన ఘటన జైపూర్‌లో చోటు చేసుకొంది. జైపూర్ బిర్లా ఆడిటోరియంలో జూన్ 30న నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గురువు స్వామి జ్ఞానవాత్సల్య, తన ప్రసంగాన్ని ప్రారంభించకుండానే వెనుదిరిగారు. తాను ప్రసంగించే ఆడిటోరియంలోని మొదటి మూడు వరుసలలో మహిళలను కూర్చోనివ్వడానికి అనుమతించకూడదని స్వామి జ్ఞానవాత్సల్య ముందుగానే సభ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తాను షరతు పెట్టినా కూడా నిర్వాహకులు మహిళలను ముందు వరుసలో కూర్చొనిచ్చిన కారణంగా.. స్వామిజీ ఈ కార్యక్రమం నుంచి వైదొలిగినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 'రాజ్ మెడికాన్ 2019' అనే ఈ కార్యక్రమాన్ని 'ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఆల్ రాజస్థాన్ ఇన్ సర్వీస్ డాక్టర్స్ అసోసియేషన్ (అరిస్డా)' నిర్వహించింది. మహిళా వైద్యులు స్వామి జ్ఞానవాత్సల్య విధించిన షరతులపై కొందరు మహిళా డాక్టర్లు కలత చెందగా, మరికొందరు దీనికి వ్యతిరేకంగా స్వామిజీ ప్రసంగాన్ని అడ్డుకుంటామని నిరసన తెలిపారు. అయితే వైద్యులు, నిర్వాహకుల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, మొదటి రెండు వరుసలను ఖాళీగా ఉంచాలని నిర్ణయించారు. కానీ, స్వామిజీ వేదిక వద్దకు రాగానే.. కొందరు మహిళలు ముందు వరుసలో వచ్చి కూర్చొన్నారు. ఈ సంఘటన గూర్చి డాక్టర్ రితు చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. స్వామిజీ ప్రసంగం వినడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చాలా మంది మహిళలు మొదటి మూడు వరుసల్లో కూర్చున్నారు. హఠాత్తుగా మొదటి మూడు వరుసల్లో మహిళలు కూర్చొరాదని అనడంతో గందరగోళం నెలకొందని అన్నారు. -
ఓ లింగా... ఆ“.. భక్తా!
‘పిలిస్తే పలుకుతడు.. కోరిక తీర్చమని మొక్కుకుంటే రెండేళ్లలోపే ఆ కోరిక తీరుతది.. ప్రతిఫలంగా మొక్కులు చెల్లించు కొనుడు.. లింగమ్మ, లింగయ్య, లింగేశ్వర్ అని పేర్లు పెట్టుకొనుడు..’ ఇదీ పెద్దగట్టు లింగమంతుల స్వామి మహత్యమని యాదవుల నమ్మకం. యాదవుల ఆరాధ్యదైవం లింగమంతుల స్వామి. అందుకే రెండురాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆయన పేర్లు వేలాదిమందికి ఉంటాయి. రెండేళ్లకోమారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో పెద్దగట్టు (గొల్లగట్టు)పై వెలసిన లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతి పెద్దది లింగమంతుల స్వామి జాతర. యాదవులు, ఇతర కులస్తులతో సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా వెళ్లే జాతీయ రహదారి, ఖమ్మం, నల్లగొండ, చౌటుప్పల్ వరకు రహదారుల్లో వేలాది వాహనాలతో జాతర నిండిపోతుంది. ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే లింగమంతల స్వామి జాతరకు పెద్దగట్టు ముస్తాబయింది. ఇలా వెలిశాడని.. క్రీ.పూ 500 ఎళ్ల క్రితం చోళ చాళుక్యులు (యాదవరాజులు), కాకతీయులు ఉండ్రుగొండ రాజధానిగా చేసుకుని పాలించేవారు. ఆ కాలంలో ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనరసింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయ దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఏటా మాఘమాసంలో లింగమంతులు, చౌడమ్మతల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేవారట. జాతర సమయంలో ఓ నిండు గర్భిణి లింగమంతులస్వామి మొక్కు చెల్లించుకునేందుకు బోనం కుండ, పూజసామాగ్రితో గంపను ఎత్తుకుని పెద్దగట్టు ఎక్కుతుండగా కాలు జారి కిందపడి మృతి చెందిందని.. దీనికి చలించిన లింగమంతులస్వామి భక్తుల సౌకర్యార్థం పార్ల శేరయ్య(గొల్లగట్టు) పై వెలిశాడని అదే గొల్లగట్టు జాతరగా జరుపుతున్నామని యాదవులు పేర్కొంటున్నారు. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. కేసారం గ్రామానికి చెందిన యాదవులు, రెడ్లు గొర్రెలు, ఆవులను మేపుకుంటూ పెద్దగట్టు వద్దకు వెళ్తారు. కరువు కాటకాలతో ఉన్న ఈ ప్రాంతంలో నీరు లేక వారు ఇబ్బందులు పడతారు. గొర్రెల కాపరికి చద్దిమూట తెచ్చిన భార్యను ఆవేశించి లింగమంతుల స్వామి జీవాలు, గొర్రెల దాహం తీర్చాలంటే తాను చూపించిన చోట బావి తవ్వాలని చెప్పడంతో ఆమె మాట ప్రకారం బావి తవ్వారట. అందులో లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, శివలింగాలు బయట పడ్డాయని.. వీటినే గొల్లగట్టుపై ప్రతిష్టించి పూజలు చేస్తూ.. కాలక్రమేణా ఇది జాతరగా మారిందని యాదవుల నమ్మకం. ఇలా పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీల్లో భక్తులు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా తరలి వస్తారు. తొలి మూడు రోజులు జాతీయ రహదారి భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తి పారవశ్యంతో ఓ లింగనాదం.. ఓ లింగ.. ఓ లింగ నినాదాలు.. భేరీ చప్పుళ్లు.. కటార్లతో సాము.. తాళాలు, గజ్జల లాగులు, చండ్రకోళలు.. ఎటుచూసినా భక్తజన సంద్రంతో పెద్దగట్టు కనిపిస్తుంటుంది. ఈనెల 10న దేవుడికి దిష్టిపూజతో జాతర పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన జాతర ఈనెల 24 నుంచి 28 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. జాతర వస్తుందంటేనే యాదవుల ఇళ్లల్లో పండుగ వాతావరణమే. జాతరకు వెళ్లే యాదవులు ఇంటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. భేరీకి మరమ్మతులు చేయిస్తారు. కటార్లు, తాళాలు, భేరీలను ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజలు చేస్తారు. మొక్కులు చెల్లించుకునే భక్తులు జాతరకు ఇళ్లనుంచే ఓ లింగా .. ఓ లింగా అనుకుంటూ బయలుదేరుతారు. పెద్దగట్టు వద్దకు చేరుకున్న తర్వాత లింగమంతుల స్వామికి నైవేద్యబోనం వండుకొని దేవాలయం చుట్టూ మూడుసార్లు తిరుగుతారు. ఇలా ఓ లింగ నినాదాలతో పెద్దగట్టు మార్మోగుతుంది. యాదవులే కాకుండా ఇతర కులస్తులు కూడా జాతరకు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఐదు రోజుల పాటు జరగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు గంపల ప్రదక్షిణ, రెండోరోజు చౌడమ్మకు బోనాలసమర్పణ, మూడవ రోజు చంద్రపట్నం, నాలుగవ రోజు నెలవారం, ఐదవరోజు ముగింపు కార్యక్రమం చేపడతారు. – బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట ఫొటోలు: అనమాల యాకయ్య, సాక్షి -
సమానతకు పట్టంగట్టిన స్వామీజీ
ఆయన కొందరికి భూమ్మీద నడిచే దేవుడు, కొందరికి 12వ శతాబ్ది సంఘసంస్కర్త బసవేశ్వరుడి రూపంలో జన్మించిన అవతారమూర్తి. వేలాది మంది పేదపిల్లలకు విద్యను అందించిన మానవతామూర్తి. మతపరమైన అనురక్తిని సమాజంలోని పేదల సంక్షేమానికి తోడ్పడేలా చేసిన నిజమైన యోగి. కర్ణాటకలోని తుమ్కూరులో సుప్రసిద్ధ శివగంగ మఠాధిపతి శివకుమారస్వామికి సమాజం కల్పించిన అపరూప విశేషణాల్లో ఇవి కొన్ని మాత్రమే. 112 సంవత్సరాల సుదీర్ఘ జీవితం తర్వాత సోమవారం శివైక్యం చెందిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ లింగాయతులకు ఆరాధ్య దైవం. 1907 ఏప్రిల్ 1న మాగడి సమీపంలోని వీరపుర గ్రామంలో జన్మించిన శివకుమార స్వామి 1927–30లలో బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1930లోనే విరక్తాశ్రమం స్వీకరించారు. ఇంగ్లిష్, కన్నడ, సంస్కృత భాషల్లో నిష్ణాతుడైన స్వామి తన జీవిత పర్యంతంలో వివాదాలకు దూరంగా మెలిగారు. కర్ణాటకలో శక్తివంతమైన లింగాయత్ కమ్యూనిటీ దన్నుతో ఆయన నేతృత్వంలోని సిద్ధగంగ పీఠం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూనే కర్ణాటకలో అసాధారణమైన రాజకీయ ప్రభావానికి నెలవుగా మారింది. ఇక విద్య, ఆరోగ్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవి. బసవన్న నిజమైన అనుయాయిగా అన్ని మతాలకు, కులాలకు చెందిన వేలాది మంది పిల్లలకు ’త్రివిధ దాసోహ’ బాటలో ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత ఆశ్రయం అనే సౌకర్యాలను దశాబ్దాలుగా అందిస్తూ వచ్చారు. 15వ శతాబ్దంలో గోసల సిద్ధేశ్వర స్వామి నెలకొల్పిన సిద్ధగంగ మఠాధిపతిగా శివకుమారస్వామి 1941లో బాధ్యతలు స్వీకరించారు. మఠం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో సంస్కృతం తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంటోంది. అన్ని మతాల, కులాల పిల్లలకు వీటిలో ప్రవేశం ఉంది. కర్ణాటకలో నేడు శివగంగ మఠ శాఖలు నెలకొల్పిన 126 విద్యా సంస్థల్లో 30 వేలమంది విద్యార్థులు విద్యనార్జిస్తున్నారు. ప్రతి సంవత్సరం శివగంగ మఠ శాఖల్లో దాదాపు 9 వేలమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా, ప్రతి రోజూ 6 వేలమంది విద్యార్థులకు, యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ‘పనే ఆరాధన’ అనేది బసవ తత్వంలో ముఖ్యమైన భావన. రోజుకు 18 గంటలపాటు పనిచేస్తూ వచ్చిన శివకుమార స్వామి బసవ సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటించారు. మఠంలో ఆశ్రయం కోరి వచ్చిన వారికి భోజన వసతి కల్పన కోసం విరాళాలు అందించాలని స్వామి ఇచ్చిన పిలుపునకు స్పందించిన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆనాటినుంచి తమ తొలి పంటను మఠానికే అర్పించసాగారు. ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో వేసిన ప్రభావానికి గుర్తింపుగా 2007లో నూరేళ్లు నిండిన సందర్భంగా ఆయనకు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డును బహూకరించింది. 2015లో కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. మనుషులందరూ సమానులే అని స్వామీజీ చాటి చెప్పారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ విశిష్ట ప్రభావం కలిగించిన ఘటనలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించడంలో ఊగిసలాటలకు గురికాలేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్న అభిప్రాయాలను తోసిపుచ్చి, బాబ్రీ కూల్చివేతను నిష్కర్షగా ఖండించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు స్వామీజీని తప్పకుండా సందర్శించి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటయింది. స్వామి నేతృత్వంలో సిద్ధగంగ మఠం ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, నర్సింగ్, ఫార్మసీ, టీచర్ ట్రెయినింగ్ వంటి రంగాలపై అనేక కాలేజీలను, సంస్కృత, కన్నడ పాఠశాలలను, డజన్ల కొద్దీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ–యూనివర్సిటీ క్యాంపస్‌లను నిర్వ హిస్తోంది. మత, కుల రహితంగా 9 వేల మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారాన్ని సమకూర్చుతోంది. బసవేశ్వరుడి తర్వాత శైవమతంపై, సమాజంపై ఇంతటి ప్రభావం వేసినవారు మరొకరు లేరని కీర్తి గడిం చిన శివకుమారస్వామి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక సేవను సమాజ సేవగా మార్చిన అసాధారణ మూర్తి. – కె. రాజశేఖరరాజు -
జగన్నాథునికి నిద్రాహారాలు కరువు
భువనేశ్వర్ : విశ్వవిఖ్యాత జగన్నాథునికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో న్యాయ, అధికారిక సంస్కరణలు జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో తీవ్ర అలజడిని రేకెత్తించాయి. శ్రీ మందిరం రత్న వేదికపై జగన్నాథునితో కొలువు దీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, సుదర్శనుడు గత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉపవాసంతో జాగారం చేయాల్సి వచ్చింది. వరుసగా సోమ, మంగళవారాల్లో ఇదే పరిస్థితి తారసపడింది. జగతి నాథునికి కష్టాలు తెచ్చిపెడుతున్న శ్రీ మందిరం దేవస్థానం సేవాయత్‌లు, అధికార వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. భగవంతుడు ఒక వైపు ఉపవాసం, జాగారాలతో నిరీక్షిస్తుండగా శ్రీ మందిరం ఆలయ వైకుంఠం (కొయిలి వైకుంఠొ) ప్రాంగణంలో అమూల్యమైన జగన్నాథుని అన్న ప్రసాదాల్ని పాతిబెట్టారు. దీంతో ఈ ప్రసాదాల కోసం పరితపించే భక్త జనానికి తీవ్ర మనస్తాపం ఎదురైంది. జగమోహన మండపం వివాదమే కారణమా! దాదాపు 2 ఏళ్లుగా మూతబడిన శ్రీ మందిరం ప్రాంగణంలోని జగ మోహన మండపాన్ని ఈ నెల 16వ తేదీన పునఃప్రారంభించారు. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. దైనందిన సేవలకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని గర్భగుడిలోకి అనుమతించ రాదని హై కోర్టు ఆంక్షలు విధించింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ఈ ఉత్తర్వులు కళంకమంటూ సేవాయత్ వర్గం ఆక్షేపించింది. గర్భగుడిలోకి ప్రవేశించడంపట్ల ఆంక్షలు నివారించాలని పట్టుబట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన కొరవడింది. దీంతో సేవాయత్ వర్గం ఎదురు దాడికి పరోక్షంగా సిద్ధమైంది. గర్భగుడి రత్నవేదికపై సేవల్ని నిర్వహించాల్సిన సింఘారి సేవాయత్ వర్గీయులకు అనివార్య కారణాలతో గర్భగుడిలోకి అడుగిడే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా సేవల్ని నిర్వహించేందుకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని రాష్ట్ర హై కోర్టు నివారించినందున అనుబంధ సేవల్ని నిర్వహించేందుకు ఇతర వర్గాల సేవాయత్‌లు కూడా నిరాకరించారు. ఇలా సోమవారం శ్రీ మందిరంలో జగమోహన మండపం పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని వివాదం తలెత్తడంతో నిత్యసేవలకు గండి పడింది. ప్రభావితమైన నిత్యసేవలు సోమవారం మంగళహారతి నుంచి ఇతర సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రాతఃకాల ధూపాదుల కార్యక్రమాన్ని సోమ వారం మధ్యాహ్నం ఆలస్యంగా నిర్వహించారు. ఈ క్రమంలో అపరాహ్న సేవలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. నిత్య కార్యకలాపాల్లో భాగంగా స్వామి వారి నివేదన కోసం వండిన అన్న ప్రసాదాలు పోటు ప్రాంగణంలోనే మగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భగుడి రత్నవేదికపై జగన్నాథునికి భోజనం లేకుండా పోయింది. నిత్య సేవల్లో క్రమం తప్పడంతో సోమవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ కూడా జరగలేదు. దీంతో స్వామి సోమవారం రాత్రి జాగారం చేయాల్సి వచ్చింది. భక్తులకూ దక్కని స్వామి ప్రసాదం మొత్తంమీద స్వామి వారికి అన్న ప్రసాదాల నివేదన జరగనందున నివేదనకు నోచుకోని అన్న ప్రసాదాల్ని శ్రీ మందిరం సముదాయంలో ఉన్న కోవెల వైకుంఠం (మూల విరాట్ల స్మశాన వాటిక)లో మట్టిలో పాతి బెట్టి చేతులు దులిపేసుకున్నారు. నిత్యం 56 రకాల వంటకాలతో అన్న ప్రసాదాల్ని సేవించాల్సిన స్వామికి వరుసగా రెండు రోజులపాటు వీటి నివేదన జరగకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ జగన్నాథుని భక్తులు తీవ్ర మనస్తాపం చెందారు. స్వామి ఉపవాసం పాలు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే అశేష సంఖ్య భక్తులు, యాత్రికులకు జగన్నాథుని మహా ప్రసాదం లభ్యం కాలేదు. -
కేసీఆర్ తిరుపతి మొక్కులపై కమ్యూనిస్టులు విమర్శలా...!
పరిపూర్ణానంద స్వామి కాకినాడ రూరల్: తిరుమల, తిరుపతి వేంకటేశ్వర స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మొక్కులు చెల్లించుకుంటే విమర్శించే హక్కు సీపీఎం నాయకుడు బీవీ రాఘవులకు లేదని శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామీజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న కేసీఆర్ అభినందనీయుడన్నారు. ఎవరు ఏ రంగంలో పని చేస్తున్నా ధార్మిక అంశాల పట్ల తన స్వధర్మాన్ని మరిచిపోకూడదన్న సందేశాన్ని కేసీఆర్ అందించారన్నారు. కేసీఆర్ మొక్కులు తీర్చుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం ఆయన మంచి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి, హెచ్డీపీడీ (హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్) రెండూ ప్రభుత్వ సంస్థలేనన్నారు. ఈ విషయం బీవీ రాఘవులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలకు కప్పం కడుతున్నది హిందూ దేవాలయాలు మాత్రమేనన్నారు. ఇతర మతాల సంస్థలు ఒక్క రూపాయి కూడా కప్పం చెల్లించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ముస్లిం, క్రైస్తవ మతాల పండుగలకు, మక్కా, జెరూసలేం వెళ్లడానికి ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం సర్వ సాధారణమైన విషయమన్నారు. అప్పుడు పైకిలేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. హిందూ ధర్మం ఆచరించని వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి యూనివర్శిటీలో ఎంతో మంది ఇతర మతాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారని, అదే ఇతర మతాలకు చెందిన విద్యా సంస్థల్లో హిందూవులకు ప్రవేశం ఇస్తారా అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు. -
భక్తజనవరం
సర్పవరం (కాకినాడ రూరల్):నాల్గో మాఘపాదివారం సందర్భంగా ఆదివారం సర్పవరం భావనారాయణస్వామి ఆలయానికి భారీ ఎత్తున భక్తజనం తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే పాతాళ భావనారాయణస్వామిని దర్శించుకోడానికి భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారదర్శనం కల్పిస్తున్నట్టు ఆలయవర్గాలు ప్రకటించడంతో ఆలయం కిటకిటలాడింది. మూడు అర్చామూర్తులైన భావనారాయణస్వామి వార్లు ఒకేప్రాంగణంలో కొలువై ఉండడం మరెక్కడా లేకపోవడంతో వేలాది భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేశారు. మొక్కులున్న భక్తులు ఆలయం ఎదురుగా ఉన్న నారద గుండంలో పుణ్య స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు. అధికసంఖ్యలో మహిళలు ఆలయ ప్రాంగణంలో పాలు పొంగించి సూర్యనమస్కారాలు చేశారు. మరి కొందరు కొత్త పాత్రల్లో తీపి వంటకాలను చేసి స్వామికి నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ 25 వేల మంది భక్తులకు అన్నదానం చేసింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, ఆలయ ఉత్సవకమిటీ చైర్మన్ పుల్లా చక్రరావు, పుల్ల ప్రభాకరరావు దంపతులు వడ్డన చేశారు. పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతా సర్పవరం భావనారాయణస్వామి ఆలయ ప్రాంతాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారని, రానున్న రోజుల్లో అన్ని హంగులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామపెద్దలు, ఉత్సవకమిటీ సభ్యులుభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంచారు. -
నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం
హంస వాహనంపై దేవేరులతో స్వామివారి విహారం అంతర్వేది(సఖినేటిపల్లి) : శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం స్థానిక మంచినీటి చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై ఊరేగింపుగా చెరువు వద్దకు అర్చకులు, భక్తులు తీసుకువచ్చారు. తెప్పోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు బుచ్చిబాబు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. పుష్పకవాహనంపై కొలువుదీరిన స్వామిని వేదమంత్రాలతో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, భక్తుల గోవింద నామస్మరణలతో తెప్పపైకి అధిరోహింపజేశారు. ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు కొబ్బరి కాయలు కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన బాణాసంచా కాల్పులు భక్తులను అలరించాయి. వెన్నెల, దీప కాంతుల నడుమ భీమేశ్వరుని తెప్పోత్సవం ద్రాక్షారామ (రామచంద్రపురం): శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణలో గల సప్తగోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దివి నుంచి చంద్రుని పున్నమి వెన్నెల... భువి నుంచి రంగు రంగుల విద్యుత్‌దీప కాంతుల నడుమ సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేకంగా అలకరించిన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తోడ్కొని వచ్చి విద్యుత్ దీపాలతో ఆలకరించిన హంసవానంలో ఉంచి పూజలు నిర్వహించారు. మూడు సార్లు నదిలో తెప్పోత్సవం జరిపారు. ఈఓ పెండ్యాల వెంకటచలపతిరావు, వేగాయమ్మపేట జమీందారు వాడ్రేవు సుందర రత్నాకర్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అంగరంగ వైభవం నింగి నేలా సంబరం
నయనానందకరం నరసింహుని కల్యాణం అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం తన్మయత్వంతో తరించిన భక్తులు అలవైకుంఠం ఇలకు దిగివచ్చిందా అన్నట్టు.. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై.. సర్వాభరణభూషితుడై కొలువుదీరిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం నయనానందకరంగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12.21 గంటల సుముహూర్తానికి జరిగిన ఈ పరిణయ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సఖినేటిపల్లి : ఆదిదేవుడు అంతర్వేది లక్ష్మీ నసింహస్వామివారి కల్యాణం నయనానందకరంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేదికపై పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాల అలంకరణతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. విష్వక్సేన పూజతో మొదలై, ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ వివాహ వేడుకను భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త తులా లగ్నపుష్కరాంశలో జరిగింది. వైష్ణవ సంప్రదాయబద్ధంగా వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యుల పర్యవేక్షణలో ఆస్థాన వేదపండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. కల్యాణ మండపం వద్ద నిర్మించిన భారీ షెడ్లలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశీనులై స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణాన్ని ఫ్యామిలీ ఫౌండర్ మెంబరు శ్రీరాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహజగపతి రాజా బహద్దూర్ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. కల్యాణం ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కల్యాణ ప్రాంగణం మార్మోగింది. కల్యాణ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎదురు సన్నాహంతో శ్రీకారం రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న సంప్రదాయ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు శ్రీరాజా బహుద్దూర్ శ్రీవారి తరఫున, అర్చకస్వాములు అమ్మవారి తరఫున వివాహకర్తలుగా నిలిచారు. ఆలయం నుంచి తొలుత స్వామిని, తరువాత అమ్మవార్లను వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు, అధికారులు, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు పల్లకిలో వేర్వేరుగా కల్యాణం మండపం వద్దకు తోడ్కొనివచ్చారు. శ్రీవారు, అమ్మవార్లకు అంతర్వేదికరకు చెందిన పోతురాజు కుటుంబీకులు గతంలో ఇచ్చిన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. కల్యాణం నిర్వహణలో ఆనవాయితీ ప్రకారం పేరూరు వేద పండితులు వచ్చి స్వామిని సేవించుకున్నారు. ఆనవాయితీగా స్వామికి తలంబ్రాలు బియ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పొలమూరు కుటుంబీకులు తీసుకువచ్చారు. స్వామివారికి, అమ్మవార్లకు మధుపర్కాలు కల్యాణానికి ముందు ప్రభుత్వ ప్రతినిధిలుగా......, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రాజప్రతినిధిగా ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా బహుద్దూర్, దేవాదాయశాఖ తరఫున డిప్యూటీ కమిషనర్..., టీటీడీ తరఫున...., అన్నవరం దేవస్థానం తరఫున పురోహితులు, గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, స్వామి, అమ్మవార్లకు మధుపర్కాలను సమర్పించారు. కల్యాణం తదనంతరం కల్యాణం తదనంతరం ప్రముఖులు, విశిష్ట అతిథులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. వీరితో పాటు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, జెడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, మాజీ జెడ్పీఛైర్మన్... ఆర్డీఓ గణేష్‌కుమార్, డీఎస్పీ అంకయ్య స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో.... పాల్గొన్నారు. అలంకరణలతో కొత్త శోభ... స్వామివారిని, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సెటారీ, వైరుముడి, సూర్యపతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటి, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, వజ్రాలు పొదిగిన హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నాన్తాడులు, చిన్ని లక్ష్మీకాసుల పేర్లతో వారిని అలంకరించారు. నేడు రథోత్సవం అంతర్వేది తీర్థమహోత్సవాల్లో భాగంగా మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని రథంపై అధిరోహింపజేసి, అసంఖ్యాకమైన భక్తుల నడుమ ఈ రథోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.42 గంటలకు మెరకవీధి నుంచి మొదలయ్యే ఈ యాత్ర పల్లపు వీధిలోని పదహారు కాళ్ల మండపానికి చేరుకోవడంతో ముగుస్తుంది. ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ మెంబరు శ్రీరాజా బహుద్దూర్, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, గోదావరి డెల్టా కమిటీ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఆర్డీఓ గణేష్ కుమార్, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు రథం వద్ద పూజలు నిర్వహించి రథయాత్రకు శ్రీకారం చుడతారు. ఈ యాత్రలో సోదరి అశ్వరూఢాంబికకు, స్వామివారు చీర, సారె ఇవ్వడం ఆనవాయితీ. స్వామి తరఫున ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహిస్తారు. ‘జనం’తర్వేది భక్తులతో కిటకిటలాడిన పవిత్ర క్షేత్రం అంతర్వేది(సఖినేటిపల్లి) : గోదావరి సప్తపాయల్లో ఒకటైన వశిష్టనది. సముద్రంలో సంగమ ప్రాంతం అంతర్వేది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం సోమవారం జనసంద్రమైంది. ఆదిదేవుడు శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రెక్కలు కట్టుకుని వాలడంతో అంతర్వేది పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తుల రాక ఆరంభం కాగా, మధ్యాహ్నం నుంచి వారి సంఖ్య రెట్టింపైంది. మన జిల్లాతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, మార్టేరు, ఏలూరు, తణుకు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే అంతర్వేదిపల్లిపాలెం వాసులకు కృష్ణా జిల్లాలోని పలుప్రాంతాల్లో బంధువులు ఉన్నారు. స్వామివారి మహోత్సవాలకు ఆయా జిల్లాల నుంచి మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఆలయ క్షేత్రపోషకులుగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు రాజవంశీయులు వ్యవహరిస్తుండడంతో ఆయా ప్రాంతాల నుంచీ భక్తులు ఎక్కువగా హాజరుకానున్నారు. -
సెంచరీలతో చెలరేగిన యేసుదాస్, స్వామి
సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఎంపీ బ్లూస్ బ్యాట్స్‌మెన్ యేసుదాస్ (102), జె. స్వామి (124) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో యూత్ సీసీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎంపీ బ్లూస్ జట్టు 175 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ బ్లూస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 315 పరుగులు చేసింది. యేసుదాస్, స్వామి సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్థి బౌలర్లలో వినోద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 316 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూత్‌సీసీ జట్టు 30 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రాజ్ కుమార్ (31) టాప్ స్కోరర్. ఎంపీ బ్లూస్ బౌలర్లలో వెంకట్ 3 వికెట్లు తీసుకోగా... సిద్ధార్థ్, సునీల్, యేసుదాస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
హైందవ ధర్మాన్ని రక్షించాలి
పుష్పగిరి స్వామీజీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి కాకినాడ కల్చరల్ : హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పురోహిత సంఘం అధ్యక్షుడు ఆకెళ్ళ మురళీకృష్ణ స్వగృహంలో స్వామీజీకి వేదమంత్ర పూర్వక పూర్ణకుంభంతో శనివారం స్వాగతం పలికారు. దేశంలో జరగుతున్న అన్యమత ప్రచారాల వల్ల హిందూమతం సంక్షోభంలో పడిందన్నారు. అన్యమత ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తాము దేశ పర్యటన చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న హైందవ విరుద్ధ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుని బోధనలను అనుసరిస్తే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందన్నారు. కార్తికమాసం సందర్భంగా శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులను అనుగ్రహిస్తున్నామన్నారు. కార్తికమాసం పుణ్యఫలం గురించి, ప్రత్యేకత గురించి భక్తులకు స్వామీజీ వివరించారు. కార్యక్రమంలో వై.పద్మనాభం, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వాడ్రేవు సుబ్మహ్మణ్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి అజ్జరపు సత్యనారాయణ, చల్లా నిరంజ¯ŒS పాల్గొన్నారు. -
డీఎస్పీ ఆఫీసు ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం
ఫిర్యాదును ఎస్ఐ పట్టించుకోవడంలేదని.. అనంతగిరి: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన రాములుకు అదే గ్రామానికి చెందిన కొందరితో పదిరోజుల క్రితం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డాడు. ఈ విషయమై రాములు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే సంబంధిత ఎస్ఐ పట్టించుకోకుండా దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన రాములు సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తన సమస్యను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లకుండానే అక్కడ సిబ్బంది చూస్తుండగా తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. గమనించిన సిబ్బంది విషయం డీఎస్పీ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములును చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. -
గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి
- కరెంట్ షాక్‌తో ఇద్దరి మృతి బొమ్మలరామారం(నల్గొండ జిల్లా) నల్గొండ జిల్లా బొమ్మలరామారం గ్రామంలో జరుగుతున్న గట్టుమైసమ్మ జాతరలో సోమవారం వేకువజామున అపశ్రుతి దొర్లింది. ఈదురుగాలులకు విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన ఏర్పుల స్వామి(65), నాగారం గ్రామంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన ఉప్పునూతల మణికంఠ(21) జాతరకు వచ్చారు. గాలికి తెగి పడిన విద్యుత్ తీగలను గమనించక పోవడంతో... వాటిపై నడుచుకుంటూ వెళ్లారు. కరెంట్ షాక్ కొట్టి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమంత వాహనంపై శ్రీరాముడి రాజసం
తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం ఉదయం స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. వాహన సేవ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, వివిధ రకాల పండ్ల రసాలతో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గజ వాహన సేవ కోలాహలంగా సాగింది. స్వామి వారు గజరాజు వాహనాన్ని అధిరోహించి ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో భూపతిరెడ్డి, వీఎస్వో రవీంద్రరెడ్డి, సూపరింటెండెంట్ కృష్ణశర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ, శేషారెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న శ్రీరామ పట్టాభిషేకం హరికథ పారాయణం కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం కడప సవేరా ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామపట్టాభిషేకం హరికథా పారాయణం భక్తులకు ఆకట్టుకుంది. రామచంద్ర పుష్కరిణి వేదికపై ఎల్.శ్రీనివాసరావు గానం చేసిన శ్రీరామజననం హరికథా గానం అలరించింది. -
సీఐ, ఎస్సైల సస్పెన్షన్
వరంగల్: హైదరాబాద్‌లోని ఓ లాడ్జీలో పట్టుబడి వివాదాస్పదమైన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మిలను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ లాడ్జిలో ఇద్దరు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజ్యలక్ష్మి భర్త సునీల్ ఈ వ్యవహారంపై పోలీసులకు ఉప్పందించారు. వెంటనే ఇద్దరినీ డీఐజీ తన కార్యాలయానికి అటాచ్ చేశారు. -
తెలంగాణ మంత్రులతో భేటీ
వినతిపత్రం సమర్పించిన ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ముంబై నుంచి తెలంగాణ ఉద్యమ సంఘీబావ వేదిక బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. బృందంలోనినాయకులు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పూలబొకే అందజేసి ముంబైలో ఉంటున్న తెలంగాణ ప్రజల తరపున అభినందనలు తెలియజేశారు. సోమవారం పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. ముంబైలోని వలస ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర ఇబ్బందులు, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రులకు అందజేశారు. ఈ బృందం ఈ నెల ఏడున ముంబై నుంచి బయలుదేరింది. కేసీఆర్, మంత్రులతో భేటీ అయిన వారిలో వేదిక నాయకులు బత్తుల లింగం, ఎడ్ల సత్తయ్య, స్వామి, వీరేందర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ జేఏసీ కార్యదర్శి నల్లా రాధాకృష్ణ, సత్తిరెడ్డితోపాటు వీళ్లంతా సచివాలయం డి-బ్లాక్‌లోని మంత్రుల కార్యాలయలకు వె ళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ అధ్యక్షుడు, కార్యదర్శి దేవి ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు. -
పగలగొట్టాల్సింది మూఢత్వాని
ఒక రోజు ప్రొద్దున కర్ణాటక అమ్మాయిలు కొందరు ఆలయానికి వచ్చారు. అంతా ఎం.బి.ఏ. ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. నేనప్పుడు మైకులో భక్తులనుద్దేశించి మాట్లాడుతున్నాను. నాతో మాట్లాడాలంటూ ఒకమ్మాయి సౌజ్ఞ చేసింది. ‘‘ ఏమి మాట్లాడాలి?’’ అని అడిగాను. ‘‘మీకు కన్నడ భాష వచ్చా స్వామీ!’’ అని అడిగారు. ‘‘దయచేసి ఆంగ్లభాషలో మాట్లాడండి’’ అని చెప్పాను. ‘‘స్వామీజీ! మేము కొబ్బరికాయ స్వామి ముందు పగుల కొట్టాము. కానీ, ఆ కాయ చెడిపోయి ఉన్నది...’’ అంటూ ఆగింది. ‘‘ఏమీ జరగదు. ధైర్యంగా వెళ్లండి. చింతించవద్దు’’ అన్నాను. ఆ అమ్మాయిలు ధైర్యంగా వెళ్లిపోయారు. కానీ, అర్థగంటలోనే తిరిగి వచ్చారు. ‘‘స్వామీ! మీరు చెప్పినది మేము నమ్మలేదు. వేరొక కొబ్బరికాయ కొనుక్కొచ్చి దేవుని ముందు పగులకొట్టాము. కానీ, ఈసారి కూడా చెడిపోయినదే వచ్చింది. మా స్నేహితురాలు ఇంకొక కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టింది. అదీ చెడిపోయింది. మా అందరికీ దిగులుగా ఉంది. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలి?’’ అని అడిగింది, భయపడుతూ... అప్పుడు గానీ నేను సమస్య లోతు అర్థం చేసుకోలేకపోయాను. గుడిలో కొట్టిన కొబ్బరికాయ చెడిపోయిందంటే భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతారనే మూఢనమ్మకంలో వారున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి త దహం భ క్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ॥ అని భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరి స్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడు. ఆ అమ్మాయిలకు ఇలా చెప్పి, ఇక వారు హాయిగా ఇళ్లకు వెళ్లవచ్చని నచ్చ చెప్పాను. క్యాంపస్ సెలక్షన్లో వాళ్లకే మొదలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఆశీర్వదించి పంపించాను. భక్తులు వారి సందేహాలతో బూటకపు వ్యక్తుల దగ్గరకు వెళుతున్నారని, ఆ వ్యక్తులు అనవసర భయాలను రేపి డబ్బు చేసుకుంటున్నారని చెప్పాను. కొబ్బరికాయ చెడిపోయిందంటే దోషమనీ, దానికి పరిహారానికి ఇంత ఖర్చు చెయ్యాలంటూ డబ్బు లాగుతున్నారని చెప్పాను. ఇక్కడ నేను జ్యోతిష్కులని కానీ జ్యోతిష్య శాస్త్రాన్ని కానీ తప్పుబట్టడం లేదు. ఆ శాస్త్రాన్ని ఉపయోగించి, ప్రజల్లో భయాన్ని రేకెత్తించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఇంకొక భక్తుడు ఇలా అడిగాడు, ‘‘కొబ్బరికాయలో పువ్వు వస్తే?! దేనికి సంకేతం స్వామీ!’’ అని, ‘‘అతి ముఖ్యమైన సంఘటన నీ జీవితంలో తొందరలో జరగబోతున్నదని సంకేతం’’ అని చెప్పాను. వారు సంతోషంగా వెళ్లిపోయారు.ఇది వింటున్న ఒక అమ్మమ్మ తన అనుభవాన్ని ఇలా పంచుకున్నది. ‘‘కొన్ని సంవత్సరాల క్రితం, ఇలాగే కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వారం లోపే మేము ఫ్లాట్ కొనుక్కున్నాము. మంచి, చెడు అంటూ ఏమీ లేదు స్వామీ. ఏ పరిస్థితిలోనైనా, ఆ భగవంతుడు మనతో ఉంటే ఏ ఇబ్బంది మనల్ని ఏమీ బాధించదు.’’ కాబట్టి, ఆ భగవంతుని పరిపూర్ణంగా నమ్మండి. జాతకాలను గానీ, జ్యోతిష్యులను కాదు. సౌందర్ రాజన్ (చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు) -
మీకు తెలుసా!
ఇరుముడిలో ఏముంటుంది? ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామగ్రి, వెనుకభాగంలో భక్తునికి కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో, కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి. కామక్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను తీసేసి, జ్ఞానమనే నెయ్యి పోసి, భక్తి, నిష్ఠ అనే రెండు ముడులను (ఇరుముడి) వేసి 41 రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి, శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుకభాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొనిపోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనే సరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్థం. శఠగోపం ఎందుకు? ఎందుకు? శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీనిపైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదాలను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది. మంచిమాట కర్మ నడిచే విధానం చాలా కఠినమైనది. నేనేమీ చేయకుండా ఉన్నా, నన్నే సర్వానికి కారణభూతమని, అన్నింటికీ నేనే మూలమని చెబుతూ వాటన్నింటి ఫలాలూ నా నెత్తిన మోపుతుంటారు. అయితే అవన్నీ వాళ్ల కర్మకొద్దీ, అదృష్టం కొద్దీ లభిస్తుంటాయి. అవన్నీ అలా అనుభవించినా నేనే చేశానంటారు. చేసేవాణ్ణి నేను కాదు. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే. చేసేది కర్త, చేయించేవాడు పరమాత్మ. ఆ పరమాత్ముడే అన్నింటిలో నిండి వున్నాడు. - షిర్డిసాయిబాబా -
వాళ్లకు మేము వ్యతిరేకం కాదు
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ‘‘కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలలో బీబీనాంచారిని హిందూ, ముస్లింలు కలసి కొలుస్తున్నాం. తిరుపతిలో స్థిరపడిన ముస్లింల కు మేము వ్యతిరేకం కాదు. వారంటే ఎనలేని గౌరవం ఉంది. మా పోరాటం చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాలపైన మాత్రమే’’ అని పలువురు స్వామీజీలు తెలిపారు. తిరుపతి సమీపంలో నిర్మిస్తున్న ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాలను తొలగించాలి, తిరుపతిని రక్షించాలి అనే నినాదంతో శుక్రవారం తిరుపతి తుడా మైదానంలో ‘హిందూ గర్జన’ సభ నిర్వహించారు. తిరుమల తిరుపతి సంరక్షణ వేదిక, హిందూ జనజాగృతి సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు ఆరు రాష్ట్రాల నుంచి వేలాది మంది సాధువులు, స్వామీజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి మాట్లాడుతూ హిందూ ధార్మిక కేంద్రమైన తిరుపతిలో చట్టవిరుద్ధంగా ఇస్లామిక్ అంతర్జాతీయ కళాశాల నిర్మించడం అశుభం అన్నారు. ఈ విషయంలో తిరుపతిలోని ముస్లింలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కమలానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ సగటు భారత దేశంలో ముస్లిం, క్రైస్తవ సోదరులతో కలసి సహజీవనం చేస్తున్నామని అయినా హిందువులను రెండవ శ్రేణులుగా చూడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇస్లామిక్ కళాశాల వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దానిని పూర్తిగా తొలగించేంతవరకు తమ న్యాయమైన పోరాటం ఆగదన్నారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల చేతిలో హత్యకు గురైన అటవీ అధికారులకు రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఉద్రిక్తత నడుమ.. సభ విజయవంతం సభకు పోలీసులు, తుడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో, రోడ్డుపైనే సభను జరుపుకుంటామని స్వామీజీలు గురువారం హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 7గంటల వరకు అనుమతి రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో స్వామీజీలు పోలీసులను నెట్టుకుంటూ గేట్లను బలవంతంగా తోసుకుంటూ మైదానంలోకి దూసుకెళ్లారు. వేలమంది మైదానాన్ని ఆక్రమించుకోవడంతో చేసేది లేక పోలీసు లు మిన్నకుండిపోయారు. కార్యక్రమంలో పలువురి స్వామీజీలతో పాటు ధర్మ ప్రచార పరిషత్ గవరయ్య, మంజులాశ్రీ, రామాంజనేయులు, ఆకుల కృష్ణకిషోర్, కల్లూరి చెంగయ్య, బాలాజీ, ప్రసాద్, మద్దెలచెరువు సూరి భార్య భానుమతి పాల్గొన్నారు. కాగా ఇస్లామిక్ కళాశాల వద్ద ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.