సెంచరీలతో చెలరేగిన యేసుదాస్, స్వామి | yesudas, swami slam centuries for mp blues team | Sakshi
Sakshi News home page

సెంచరీలతో చెలరేగిన యేసుదాస్, స్వామి

Published Mon, Dec 5 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

yesudas, swami slam centuries for mp blues team

సాక్షి, హైదరాబాద్: ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో ఎంపీ బ్లూస్ బ్యాట్స్‌మెన్ యేసుదాస్ (102), జె. స్వామి (124) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో యూత్ సీసీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎంపీ బ్లూస్ జట్టు 175 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ బ్లూస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 315 పరుగులు చేసింది. యేసుదాస్, స్వామి సెంచరీలతో చెలరేగారు.

 

ప్రత్యర్థి బౌలర్లలో వినోద్ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం 316 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన యూత్‌సీసీ జట్టు 30 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రాజ్ కుమార్ (31) టాప్ స్కోరర్. ఎంపీ బ్లూస్ బౌలర్లలో వెంకట్ 3 వికెట్లు తీసుకోగా... సిద్ధార్థ్, సునీల్, యేసుదాస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement