సాక్షి, హైదరాబాద్: నిత్యజీవితంలో ఆచరణే వేదాంత పరమలక్ష్యమని హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. రామకృష్ణ మిషన్ 125వ వార్షికోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ రామకృష్ణమఠంలో ఆరోగ్య సేవలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రానికి 44 సంవత్సరాలుగా పేదలకు వైద్యసేవలు అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు.
వైద్యులకు, రోగులకు మధ్య ఆరోగ్యకరమైన అనుబంధం ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గుర్తుచేశారు. వైద్య వృత్తిని సేవాభావంతో నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ రవీంద్ర, డాక్టర్ స్మితా కోల్హే, నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యుడు, డాక్టర్ సంతోష్ క్రాలేటి, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మెన్ రవీందర్ రావు, బేలూర్ మఠానికి చెందిన స్వామి సత్యేశానంద, ఈటానగర్ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి కృపాకరానంద, ముంబై రామకృష్ణ మిషన్ హాస్పిటల్‌కు చెందిన స్వామి దయాధిపానంద, వైద్యులు, వాలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.
చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
Comments
Please login to add a commentAdd a comment