మెదక్: సెల్ఫీ సరదా కోసం యువకులు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా సరదా కోసం సెల్ఫీలు దిగడం, అనంతరం సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. సెల్ఫీపై మోజుతో ఇద్దరు యవకులు ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో గల్లంతైన ఘటనలు పటాన్‌చెరులోని పెద్దవాగు, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద బుధవారం చోటుచేసుకున్నాయి.
పెద్దవాగులో వేణు అనే యువకుడు చిక్కుకపోగా, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద సెల్ఫీ దిగుతుండగా రాము (24) అనే యువకుడు కొట్టుకపోయాడు. స్థానికుల సమాచారంతో అధికారులు వేణుని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హెలికాప్టర్ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గల్లంతైన రాము అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సెల్ఫీ సరదా.... ముంచేసింది!
Published Wed, Sep 21 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
Advertisement
Advertisement