
బెంగళూరులో రెచ్చిపోయిన మృగాడు
బనశంకరి: బెంగళూరులో మృగాళ్ల అకృత్యాలకు అడ్డుకట్టపడలేదు. కేజీ హళ్లి, కమ్మనహళ్లి ఘటనలు మరువకముందే మరో మృగాడు రెచ్చిపోయాడు. ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను నిర్జీన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. వయ్యాలి కావల్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్విమ్మింగ్‌పూల్ లేఔట్‌లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ మహిళ ఇంటికి నడుచుకుని వెళ్తుండగా మునీశ్వరబ్లాక్‌కు చెందిన మణికంఠ అనే యువకుడు అడ్డుకుని లైంగికదౌర్జన్యానికి యత్నించాడు.
అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో సదరు యువకుడు వయ్యాలికావల్ 5 వమెయిన్‌రోడ్డులో పాఠశాల ముగించుకుని ఇంటికి వెళుతున్న ఇద్దరు బాలికలను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వయ్యాలికావల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మణికంఠ పీయూసీ పూర్తిచేసి పొట్టకూటికోసం నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు గంజాయికి బానిసైనట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.