Brij Mohan
-
సంతాప సమావేశంలో మంత్రులు నవ్వులు
-
సంతాప సమావేశంలో పడీపడీ నవ్విన మంత్రులు
రాయ్‌పూర్ : దేశం గర్వించదగ్గ రాజకీయ నేత వాజ్‌పేయి. కాంగ్రెసేతర ప్రధానిగా మూడు సార్లు పదవి బాధ్యతలు చేపట్టిన వాజ్‌పేయి, తీవ్ర అనారోగ్య ఇబ్బందులతో ఈ నెల 16వ తేదీని కన్నుమూశారు. ఆయన మరణవార్తతో యావత్ భారత దేశం మూగబోయింది. వాజ్‌పేయి చితాభస్మాలను అన్ని రాష్ట్రాల నదీ జలాల్లో నిమజ్జనం చేపడుతున్నారు. అంతేకాక సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన వాజ్‌పేయి సంతాప సభలో బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాపసభ రాయ్‌పూర్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయిన వారంతా వాజ్‌పేయికి విషణ్ణ వదనంతో నివాళులర్పించారు. కానీ, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అజయ్ చంద్రకర్, వ్యవసాయ శాఖా మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ మాత్రం ముందున్న బల్లను కొట్టుకుంటూ పడీపడీ నవ్వుతూ సంతాప సభను అపహాస్యం చేశారు. సంతాప సభలో పక్కపక్కను కూర్చున్న వీరిద్దరూ జోకులేసుకుంటూ బిగ్గరగా నవ్వుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చంద్రకర్ ముందున్న టేబుల్ కొడుతూ పడీపడీ నవ్వుతున్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ ధరమ్‌లాల్ కౌశిక్ ఆయన చేతిని పట్టుకుని, వారి నవ్వులను ఆపాలని పలుసార్లు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా పాల్గొన్నారు. మంత్రుల వ్యవహరించిన తీరుపై వాజ్‌పేయి అభిమానుల నుంచి, విపక్ష సభ్యుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నేతలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. నెటిజన్లు ఈ మంత్రులిద్దరిపై సోషల్ మీడియా సాక్షిగా దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీకి ఎంతో సేవ చేసిన వాజ్‌పేయికి సొంత పార్టీ నేతలిచ్చే గౌరవమిదేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. వాజ్‌పేయి బతికి ఉన్నప్పుడే, ఆయన్ను బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదని, మీ నేతకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేత శైలేష్ నితిన్ త్రివేది, విమర్శించారు. ‘బీజేపీ నేతలు అటల్ జీకి గౌరవం ఇవ్వలేకపోతే, కనీసం ఆయనను తక్కువ చేయొద్దు. అటల్ జీ చనిపోయిన తర్వాత ఆయనపై బీజేపీ, రమణ్ సింగ్ చూపిస్తున్న ప్రేమ, గౌరవం ఏమీ లేదు. ఇదంతా కేవలం డ్రామానే’ అని అన్నారు. -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య
పహాడీషరీఫ్: దుండగులు ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ను చాదర్‌ఘాట్‌లో కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశారు. అతడి నోటికి టేప్‌వేసి.. చేతులు కట్టేసి.. ఉరేసి చంపేశారు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.... చంపాపేట్‌లోని ఈస్ట్ మారుతీనగర్‌లో నివాసముండే బ్రిజ్మోహన్ (54) చాదర్‌ఘాట్ ఎస్బీఐ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్. ఇతనిడి కుమారుడు రోజూ ఉదయం బ్యాంక్ వద్ద తన వాహనంపై దింపుతాడు. విధులు ముగిశాక బ్రిజ్మోహన్ సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటాడు. ఇదిలా ఉండగా శనివారం విధులకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... పహాడీషరీఫ్ గ్రామ శివారులో ఉన్న ఉమర్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మౌలానా మహ్మద్ రాషేద్ హుస్సేనీ ఖురేషీ దర్గా ఉంది. నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో స్థానిక చిన్నారులు ఆదివారం ఉదయం 7.30కి క్రికెట్ ఆడుతున్నారు. దర్గా వైపు బంతి వెళ్లడంతో పట్టుకునేందుకు పరుగులు పెట్టిన చిన్నారులు అక్కడ పడి ఉన్న మృతదేహాన్ని చూసి భయంతో బస్తీలోకి పరుగులు తీసి పెద్దలకు విషయం తెలి పారు. వారు వెంటనే పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. దాదాపు 40 ఏళ్ల వ్యక్తి నోరు, చేతులను దుండగులు మెడికల్ టేప్(ఆసుపత్రులలో గాయాలకు వినియోగించే క్లాత్)తో కట్టేసి, మెడకు తాడుతో ఉరేసి అనంతరం అక్కడే ఉన్న మూడు బండరాళ్లతో ముఖంపై బాది హత్య చేసినట్టు గుర్తించారు. వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా.. జాగిలం ఘటనాస్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి.. అక్కడే వంద మీటర్ల దూరంలో కలియ తిరిగి మృతదేహం వద్దకు తిరిగి వచ్చింది. స్థానికులెవ్వరూ మృతుడిని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడి జేబులో మలక్‌పేటలోని ఎస్బీఐ ఏటీఎంలో జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రసీదులు దొరికాయి. గతనెల 30న ఇదే ఏటీఎంలో రూ. 100లు డ్రా చేసిన రసీ దు, 31వ తేదీ సాయంత్రంతీసుకున్న మినీస్టేట్మెట్ లభించాయి. మృతుడు వేసుకున్న చొక్కాపై వీఎన్ఆర్ టైలర్, చంపాపేట్ అనే లేబుల్ ఉంది. దర్యాప్తు చేపట్టిన పో లీసులు హతుడు చాదర్‌ఘాట్ ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌గా గుర్తించారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.