21 Year Old Man Arrest Kidnapping Minor Boy Gift For Childless Uncle - Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్‌ కేసు: నిందితుడి షాకింగ్‌ ట్విస్ట్‌..నివ్వెరపోయిన పోలీసులు

Published Sun, Jan 8 2023 10:55 AM | Last Updated on Sun, Jan 8 2023 12:58 PM

21 Year Old Man Arrest Kidnapping Minor Boy Gift For Childless Uncle - Sakshi

ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్‌ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది.

దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్‌ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్‌ చేసి పట్టుకున్నారు.

ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

(చదవండి: భ‍ర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్‌ ట్విస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement