childless
-
సాఫ్ట్వేర్ ఉద్యోగులు వద్దు
పేరు ఓరుగంటి కల్యాణి. ప్రభుత్వోద్యోగి కావాలనే లక్ష్యంతో గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ తనకు కాబోయే వరుడు ప్రభుత్వోద్యోగి అయ్యుండాలని, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉండకూడదని, వెజిటేరియన్ అయ్యుండాలని ఆశ పడుతుంది కల్యాణి. అంతే కాదండోయ్... సాఫ్ట్వేర్ ఉద్యోగి అసలే వద్దు అంటోంది. మరి... కల్యాణి ఆకాంక్షకు తగ్గ వరుడు దొరికాడా? లేదా అనేది ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో చూడొచ్చు. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఇది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. బుధవారం (అక్టోబరు 23) చాందినీ చౌదరీ బర్త్ డే సందర్భంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’లో ఓరుగంటి కల్యాణి పాత్రలో ఆమె నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం చాలామంది ఫేస్ చేస్తున్న సంతానలేమి సమస్య ఆధారంగా ‘సంతాన ్రపాప్తిరస్తు’ తీస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది’’ అని తెలిపారు మేకర్స్. -
South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి. నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం. దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్‌కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు! అట్టడుగుకు జననాల రేటు ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది! ఫలించని ప్రోత్సాహకాలు... పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని సామాజికవేత్తలు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదని.. భార్యపై..
పత్తికొండ రూరల్(కర్నూలు జిల్లా): పెళ్లి జరిగి రెండేళ్లు అయినా సంతానం కలగలేదని భార్యపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా.. మండల పరిధిలోని చందోలి గ్రామానికి చెందిన బోయ లాలప్ప, ఆదిలక్ష్మి కుమార్తె భవానీని రెండేళ్ల క్రితం డోన్ మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన రాముకు ఇచ్చి వివాహం చేశారు. గత కొన్ని నెలల నుంచి సంతానం కలగలేదని భార్యను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. మంగళవారం ఇదే విషయంపై భార్యతో గొడవపెట్టుకుని దాడి చేశాడు. వెన్నెముక, కాళ్లు, చేతులపై విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె కుప్పకూలిపోయింది. భవానీని చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వైద్యులు కర్నూలుకు రెఫర్ చేసినట్లు బాధిత మహిళ తల్లిదండ్రులు తెలిపారు. చదవండి: ప్రియురాలితో గోవా టూర్ కోసం ఏం చేశాడో తెలిస్తే షాకే! -
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య
పెద్దేముల్: పిల్లలు పుట్టలేదని మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పాండు (32), కవిత (27)లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయం గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాండు, కవిత బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
ఆడబిడ్డను 'అమ్మే' సింది!
ధన్బాద్ః ముగ్గురు పిల్లలకు మాతృమూర్తి. అయినా మరోకాన్పుకు సిద్ధమైంది. నాలుగోసారి ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. అప్పుడుకానీ ఆమెకు పెంచలేమన్న భయం తెలియలేదు కాబోసు.. కళ్ళుతెరవని పసిగుడ్డును బేరం పెట్టేసింది. పిల్లలు లేని ఓ మహిళకు కేవలం 7 వేల రూపాయలకు పొత్తిళ్ళలో బిడ్డను అమ్మేసింది. ఆర్థిక దారిద్ర్యం ఆమెను 'అమ్మ'కానికి పురిగొల్పింది. జార్ఖండ్ ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ళ దులాలీ దేవి తన నవజాత శివువును పాటలీపుత్ర మెడికల్ కాలేజీ (పీఎంసీహెచ్) వద్ద ఓ పిల్లలు లేని మహిళకు 7000 రూపాయలకు అమ్మేసింది. దులాలీ దేవికి అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా.. ఆమె నాలుగో ప్రసవంలో పీఎంసీహెచ్ లోని గైనకాలజీ వార్డులో ఒక ఆడ, ఒక మగ సహా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. దీంతో పుట్టిన కవలల్లోని ఆడబిడ్డను దులాలీ దేవి.. పిల్లలు లేని షహీదా కతూన్ కు 7 వేల రూపాయలకు అమ్మేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి (సీడబ్ల్యూసీ) ఛైర్ పర్సన్ నీతా సిన్హా తెలిపారు. ఆర్థిక అవసరాలతో దులాలీ దేవి బిడ్డను అమ్మేసిన సమాచారం తెలుసుకున్న సీడబ్ల్యూసీ జోక్యంతో... 24 గంటలు తిరిగే లోపు బిడ్డ తల్లివద్దకు చేరింది. శిశువును వెనక్కు తెప్పించిన సమయంలోనే షహీదా కనూన్ ను జూలై 21న విచారణకోసం తమ కార్యాలయానికి రమ్మని పిలిచినట్లు సిన్హా తెలిపారు. మరోవైపు పీఎంసీహెచ్ ఆసుపత్రిలో పసిపిల్లల అమ్మకాలపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రారంభ నివేదికల ప్రకారం తమ ఆస్పత్రిలోని సిబ్బందికి అమ్మకాలకు ఎటువంటి సంబంధం లేదని పీఎంసీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ రంజన్ పాండే చెప్పారు. అయితే ఆస్పత్రిలో ప్రస్తుత సంఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణకు ఆదేశించింది. తన ఐదుగురు పిల్లలను పెంచే స్థోమత లేకపోవడంతోనే బిడ్డను అమ్మే ప్రయత్నం చేసినట్లు దులాలీదేవి ఆస్పత్రి అధికారులు, సీడబ్ల్యూసీ ముందు ఒప్పుకుంది. తన భర్త ఓ రోలింగ్ మిల్లులో పని చేస్తాడని, అతడి ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలడం లేదని.. పొట్ట గడవడంకోసమే తన బిడ్డను అమ్మకానికి పెట్టాల్సివచ్చిందని దులాలీ ఆవేదన వ్యక్తం చేసింది.