పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య | Childless couple commits suicide | Sakshi
Sakshi News home page

పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య

Published Fri, Sep 2 2016 10:11 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

Childless couple commits suicide

పెద్దేముల్: పిల్లలు పుట్టలేదని మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పాండు (32), కవిత (27)లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే ఆ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయం గమనించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాండు, కవిత బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement