pandu
-
పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న గడ్చిరోలికి చెందిన పాండు నరేటి మృతిపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రొఫెసర్ సాయిబాబా కేసులో అరెస్టయిన ఐదుగురిలో పాండు నరేటి ఒకరని, ఈ నెల 26నే నాగ్‌పూర్ జైల్లో పాండు నరేటి మృతిచెందిన వార్తను బీజేపీ ప్రభుత్వం దాచిపెట్టిందని ఆరోపించింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మంగళవారం ఈ మేరకు లేఖ విడుదల చేశారు. తప్పుడు కేసుకు, శిక్షకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు పోరాడుతున్నాయని, ఆరోగ్యం సరిగాలేని పాండు స్వైన్ ఫ్లూతో మరణించినట్టు అభయ్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు గానీ, ఆయన తరపు లాయర్‌కు తెలియజేయలేదని ఆరోపించారు. పాండును చికిత్స నిమిత్తం మెరుగైన ఆస్పత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులకు డాక్టర్లు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పాండు మరణం ప్రభుత్వ హత్య అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని అభయ్ స్పష్టంచేశారు. ముంబయి జైల్లో ఉన్న మావోయిస్టు కిరణ్ క్యాన్సర్ చికిత్స పొందుతున్నారని, ఆయన భార్య నర్మద ఆరోగ్యం విషమించిందని తెలిసినా కనీసం చూసేందుకు ఆయన్ను తీసుకెళ్లలేదని ఆరోపించారు. తీరా ఆమె చనిపోయిన తర్వాత శవాన్ని చూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. పౌరుల ప్రజాస్వామిక, మౌలిక హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ చర్యలను యావత్ ప్రజానీకం ఖండించాలని పిలుపునిచ్చారు. ఐసీఎస్ పీడబ్ల్యూఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 13నుంచి 19 వరకు జరగనున్న ఆక్షన్ వీక్‌లో ఈ విషయంపై ప్రశ్నించాలని అభయ్ కోరారు. చదవండి: వారిద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. అయితేనేం వారి కనుసన్నల్లోనే.. -
రౌడీషీటర్ పండు అరెస్ట్
-
రౌడీషీటర్ పండు వీరంగం.. స్నేహితుడిపై కత్తులతో దాడి
సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు: సరిగ్గా ఏడాది కిందట నగరంలో గ్యాంగ్‌వార్‌తో రెచ్చిపోయిన కొండూరి మణికంఠ అలియాస్ కేటీఎం పండు మరోసారి నగరంలో వీరంగం సృష్టించాడు. ఆదివారం కానూరు వంద అడుగుల రోడ్డులో పండు స్నేహితులతో మారణాయుధాలతో ప్రజల్ని భయాభ్రాంతులకు గురిచేస్తున్నాడన్న సమాచారంతో పెనమలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పండుతో పాటు ఆరుగురు గ్యాంగ్ సభ్యుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుచారు. గత ఏడాది మే నెల 30వ తేదీన పటమట పప్పులమిల్లు సెంటర్ సమీప మైదానంలో రౌడీషీటర్ తోటా సందీప్, కేటీఎం పండు స్నేహితుల మధ్య గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో తోటా సందీప్ గాయపడి మే 31న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన 40 మందిపై పోలీసులు రౌడీషీటు తెరిచారు. సందీప్ మృతితో ప్రధాన నిందితుడు పండుతో పాటు మిగిలిన వారందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉన్న పండు ఈ ఏడాది జనవరిలో షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యాడు. మూడు నెలలపాటు నగరంలో అడుగుపెట్టరాదని కోర్టు షరతు విధించడంతో పండు పామర్రులో మూడు నెలలు ఉన్నాడు. అనంతరం చికిత్స నిమిత్తం తనకు నగరంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విన్నవించడంతో సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో ఉంటున్నాడు. ఈ సమయంలోనే అక్రమ సంపాదనకు తెరతీశాడు. 20 రోజుల క్రితం పండు, అతడి అనుచరులు విశాఖపట్నం వెళ్లి గంజాయి తీసుకొచ్చారు. విజయవాడ శివారుతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. స్నేహితుడిపై కత్తులతో దాడి వీడియోతో.. గత బుధవారం రౌడీషీటర్ మణికంఠ స్నేహితుడు కోనేరు రాజా పుట్టిన రోజు కావడంతో పండు తన స్నేహితులతో కలిసి వేడుకల్లో మద్యంతోపాటు గంజాయి తీసుకున్నారు. అనంతరం కోనేరు రాజాను పండుతోపాటు ఇతరులు కలసి కత్తులతో, కర్రలతో కొడుతున్నట్లు ఓ వీడియో చిత్రీకరించి ఫేస్బుక్లో అప్లౌడ్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అయింది. గతంలోనూ పండు తనలోని క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ అనేకసార్లు టిక్‌టాక్ వీడియోలతో హల్చల్ చేశాడు. మారణాయుధాలతో సంచరిస్తూ... ఆదివారం పండు తన స్నేహితులతో కలిసి మారణాయుధాలతో సంచరిస్తూ ఓ సెటిల్మెంట్కు ప్రయత్నిస్తున్న సమయంలో పెనమలూరు పోలీసులు పక్కా సమాచారంతో కానూరు వంద అడుగుల రోడ్డులో వారిని అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌కు చెందిన పండుతోపాటు కోనేరు రాజా, కవి ప్రవీణ్, తిరుమలశెట్టి నాగరాజు, సప్పా దర్గారావు, విజయవాడ ఫకీర్గూడెంకు చెందిన షేక్ గాలీబ్‌ల నుంచి రెండు పెద్ద కత్తులు, 8 చిన్నకత్తులు, 15 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. పండు నేర చరిత్ర ... కేటీఎం పండు నేర చరిత్ర పెద్దదే. పండుపై విజయవాడ నగరంలో ఏడు కేసులు నమోదు అయ్యాయి. పటమట పీఎస్ పరిధిలో ఒక హత్య, ఒక హత్యాయత్నం కేసు, ఒక కొట్లాట కేసు, కృష్ణలంక పీఎస్‌లో ఒక కొట్లాట కేసు, పెనమలూరు పీఎస్ పరిధిలో రెండు కొట్లాట కేసులు, ఒక బైండోవర్ కేసు నమోదు అయ్యాయి. 2020లో అతనిపై రౌడీషీటు తెరిచారు. -
కరోనాతో ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Comedian Pandu: కోలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమం ఉన్నట్లు తెలుస్తోంది. పాండు మృతి పట్ట కోలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతను 1970 లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేశాడు. దీనిలో అతను విద్యార్థి పాత్రను పోషించాడు. ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్‌తో పాండు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.కాదల్ కొట్టై, పనక్కరన్, దైవ నాకు, రాజది రాజ, నాట్టమై, ఉల్లతై అల్లితా, వాలి, ఎన్నవాలే అండ్ సిటిజన్, తదితర సినిమాల్లో ఆయన నటించారు. Rip Pandu..He passed away early morning today due to covid. pic.twitter.com/w8q8JdVCAp — Manobala (@manobalam) May 6, 2021 -
ఈ బుల్లితెర జంట విడిపోనుందా?
ప్రముఖ డ్యాన్స్ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్ కోరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేగాక ఈ షోలో అదరగొట్టె స్టేప్పులతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. అందులో అక్సా ఖాన్ కూడా ఉంది. ఢీ 10 కంటెస్టెంట్‌గా వచ్చిన అక్సా ఛాంపియన్ కాలేనప్పటికి ఈ సీజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. స్టేజ్‌పై స్వింగ్ జర స్వింగ్ జర అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను, షో జడ్జ్‌లను మంత్రముగ్ధులను చేసింది. మరి ముఖ్యంగా తన డ్యాన్స్, ఆటిట్యూడ్‌తో శేఖర్ మాస్టర్‌ను కట్టిపడేసేది ఈ ముద్దుగుమ్మ. చివరి వరకు పోటీ ఇచ్చిన అక్సా ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయ్యి ఇంటిదారి పట్టింది. అయినప్పటికి ఫైనల్లో అక్సాతో స్పెషల్ పర్ఫామెన్స్ కింద శేఖర్ మాస్టర్ డ్యాన్స్ చేయించాడు. ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె స్వింగ్ జర పాటకు కాలు కదిపింది. దీంతో సెలబ్రెటీ అయిపోయన అక్సా పలు ఇంటర్వ్యూలో హీరోయిన్ అవ్వాలనేది తన కల అంటూ చెప్పుకొచ్చెది. ఇదిలా ఉండగా ఇదే షోలోని మరో డ్యాన్సర్, బుల్లితెర మైకల్ జాక్సన్ పండుకు అక్సాకు మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే పండును చాంపియన్స్ నుంచి ఎలిమినేట్ చేయడం అక్సాఖాన్‌ను బాధించింది. దీంతో ఆమె పండు కోసం శేఖర్ మాస్టర్‌తో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాల్లో తీవ్ర దుమారం రేపింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ టాక్. అది తెలిసి ఢీ ప్రేక్షకులు, అభిమానులు పండు, అక్సాలు ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకున్నారు. అంతేగాక పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ జంట డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వడంతో ఇక వీరద్దరిని జోడిగా పిక్సైయిపోయారు. అంతేగాక ఈ జంట త్వరలోనే ఓ డ్యాన్స్ అకాడమిని స్థాపించి సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకొవాలనే యోచనలో ఉన్నట్లు కూడా ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఇక అక్సా ప్రసుతం ఆర్జీవీ అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు పండు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ అయిపోయాడు. అంతా బాగా సాగుతున్న క్రమంలో ఈ మధ్య పండు, అక్సాల మధ్య మాటలు తగ్గినట్లుగా కనిపిస్తోదంట. వీరిమధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు వినికిడి. కారణమేంటో తెలియదు గానీ పండు తనను దూరం పెడుతున్నాడని, తన ప్రవర్తన నచ్చడం లేదంటూ అక్సా తన సన్నిహితులతో వాపోయిందట. దీంతో ఈ జంట తమ ప్రేమయాణానికి బ్రేకప్ చెప్పుకునేలా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చదవండి: ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండగే! ఫోన్ నెంబర్ లీక్ చేసిన రాజ్ తరుణ్! -
బెజవాడ గ్యాంగ్‌వార్ : పండు అరెస్ట్
సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో గాయాలు అవ్వడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీస్ ప్రొటక్షన్ మధ్య అతడికి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కుదటపడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వద్ద నుంచి తోట సందీప్ హత్యకు వినియోగించిన రెండు కత్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. (చదవండి : బెజవాడలో అలజడి) కాగా ఇప్పటికే ఈకేసులో ఇరు వర్గాలకు చెందిన 33 మందిని పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులపై రౌడీ షీట్లు తెరవనున్నారు. నేరచరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగరబహిష్కరణ చెయ్యాలని నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండి : పండు.. మామూలోడు కాదు!) -
బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. మరో ముందడుగు
సాక్షి, కృష్ణా: జెజయవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పోలీసులు మరో తొమ్మిది మంది వీధి రౌడీలను బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిలో పండు గ్యాంగ్‌కి చెందినవారు ఐదుగురు, సందీప్ బ్యాచ్‌కి చెందినవారు నలుగురు ఉన్నారు. ఇప్పటికే రెండు గ్యాంగ్‌లకు చెందిన 24 మందిని పోలీసులు రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు పోలీసు బృందాలు కేసు మూలాలను అన్వేషిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే గ్యాంగ్ లీడర్ పండుని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. పండు విచారణలో సందీప్ హత్య వెనక ఉన్న కారణాలను పోలీసులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. సందీప్ కుటుంబసభ్యుల ఆరోపణలపైనా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సీన్ రీ కన్స్ట్రక్షన్లో కీలక విషయాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు వీధి రౌడీలకు నగర బహిష్కరణ విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘పండు’ హత్య కేసులో... నిందితుడికి జీవిత ఖైదు
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు అలియాస్ పండు హత్య కేసులో విచారణ పూర్తయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆముదాల మహేందర్‌రెడ్డి అలియాస్ మహిపాల్‌రెడ్డిని దోషిగా నిర్ధారించిన నాంపల్లిలోని మొదటి అదనపు చీఫ్ మెట్రోలిపాటన్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పండును హత్య చేసి పారిపోయిన మహేందర్ గుల్బర్గా వెళ్లి అప్పటి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. విశాఖపట్నంలో తెలుగుదేశం నాయకులు కంభంపాటి రామ్మోహన్రావు, గద్దె బాబూరావు, చలసాని పండు ఖరీదు చేసిన స్థలానికి మహేందర్ దళారిగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఇతడికి రావాల్సిన కమీషన్‌ను వారు ఎగ్గొట్టడమే హత్యకు కారణంగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తెలంగాణలోని ములుగు జిల్లా, పస్రాకు (అప్పట్లో ఇది వరంగల్ జిల్లాలో ఉండేది) చెందిన మహేందర్‌రెడ్డి విజయవాడలో మహిపాల్‌రెడ్డి పేరుతో చెలామణి అయ్యాడు. అక్కడ దేవినేని నెహ్రూ, చలసాని పండులకు ప్రధాన అనుచరుడిగా పని చేశాడు. దాదాపు దశాబ్ధన్నరకు పైగా పండు దగ్గరే ఉన్న మహేందర్ హైదరాబాద్‌కు మాకాం మార్చిన తరవాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. అయినా పండుతో సంబంధాలు కొనసాగిస్తూ కొన్ని స్థలాలకు సంబంధించిన వ్యవహారాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన గుండేరావుతో కలిసి 2003 డిసెంబర్లో విశాఖపట్నంలోని మురళీనగర్‌లో ఉన్న బిర్లా సంస్థకు చెందిన 24 ఎకరాల స్థలాన్ని పండుకు ఇప్పించాడు. విజయవాడకు చెందిన టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్రావు, గద్దె బాబూరావులతో కలిసి చలసాని పండు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతుండగా... మహేందర్, గుండేరావు, బిర్లా సంస్థకు చెందిన ప్రతినిధులు కలిసి రూ.65 లక్షలకు ఖరారు చేశారు. నగదు చెల్లించిన ఈ త్రయం స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి మహేందర్, గుండేరావులకు పండు కమీషన్ రూపంలో రూ.2.35 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఆ చెల్లింపు జరగలేదు. మహేందర్ తనకు రావాల్సిన కమీషన్‌ను ఇవ్వాల్సిందిగా పండును 2003 నుంచి 2010 వరకు అడుగుతూనే ఉన్నా అతను పట్టించుకోలేదు. ఓ దశలో రియల్ ఎస్టేట్‌బూమ్ దెబ్బతినడంతో మహేందర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. దీంతో పండు నుంచి రావాల్సిన డబ్బు కోసం ఆయనపై ఒత్తిడి చేశాడు. మహేందర్‌తో పాటు అతడి భార్య రూప సైతం పండు, అతడి భార్యలను డబ్బు విషయమై అనేకసార్లు ప్రాధేయపడింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో మహేందర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. విజయవాడలో ఉండగా కొన్నేళ్ల పాటు పండుకు సన్నిహితంగా మెలిగిన మహేందర్‌రెడ్డి అతను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అన్నీ సమకూర్చేవాడు. చివరకు పండు గెస్ట్‌హౌస్‌గా వినియోగిస్తున్న మధురానగర్‌లోని అపార్ట్మెంట్ ఫ్లాట్ ఖర్చులను సైతం భరించేవాడు. కనీసం కొంతయినా ఇవ్వమని అనేకమార్లు పండును ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది. 2010 సెప్టెంబర్ మూడో వారంలో పండు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రతి రోజూ అతడి వద్దకు వచ్చి సపర్యలు చేస్తున్న మహేందర్ నగదు అడిగేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశాడు. సమయం చిక్కకపోవడంతో ఎలాగైనా నగదు విషయం మాట్లాడాలని నిర్ణయించుకున్న మహేందర్ 2010 సెప్టెంబర్ 26 రాత్రి మధురానగర్‌లోని పండు ఫ్లాట్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా... తనకు రావాల్సిన మొత్తం కాకపోయినా... కనీసం కొంతయినా ఇవ్వాలని మహేందర్ కోరాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే రాత్రి 10.30 గంటల ప్రాంతంలో క్షణికావేశానికి లోనైన మహేందర్ అక్కడే ఉన్న వస్తువులతో పండును హత్య చేశాడు. గుల్బర్గా పారిపోయిన అతను 2010 సెప్టెంబర్ 28న అక్కడి ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసు మహేందర్‌పై నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన ఏపీపీ కె.ప్రతాప్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మహేందర్‌కు జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. -
పిల్లలు లేరని దంపతుల ఆత్మహత్య
పెద్దేముల్: పిల్లలు పుట్టలేదని మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పాండు (32), కవిత (27)లకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ దంపతులకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. దీంతో మనస్తాపానికి గురైన దంపతులు గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్థానికులు ఆ విషయం గమనించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో పాండు, కవిత బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
తెలంగాణలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం మరో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని అక్కన్నపేటలో పిడుగుపాటు గురై ఓ రైతు మృతి చెందాడు. అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య పొలంలో పనులు చేస్తుండా ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్ద శబ్ధంతో పిడుగు పొలంలో ఉన్న రైతుపై పడింది. ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో గంధగూడకు చెందిన తలారి చంద్రయ్య తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి చనిపోయాడు.అలాగే రాజేంద్రనగర్ మండలంలోని భైరాగిగూడలో పాండు అని వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో పిడుగు పాటుకు గురై మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. -
చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి
విశాఖపట్టణం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చింతపాడు మండలం మేడూరు గ్రామంలో బుధవారం ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో పాండు(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.