Comedian Pandu: కోలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా, పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమం ఉన్నట్లు తెలుస్తోంది. పాండు మృతి పట్ట కోలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతను 1970 లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేశాడు. దీనిలో అతను విద్యార్థి పాత్రను పోషించాడు. ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచాపులి సెల్వరాజ్‌తో పాండు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.కాదల్ కొట్టై, పనక్కరన్, దైవ నాకు, రాజది రాజ, నాట్టమై, ఉల్లతై అల్లితా, వాలి, ఎన్నవాలే అండ్ సిటిజన్, తదితర సినిమాల్లో ఆయన నటించారు.
Rip Pandu..He passed away early morning today due to covid. pic.twitter.com/w8q8JdVCAp
— Manobala (@manobalam) May 6, 2021
Comments
Please login to add a commentAdd a comment