సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విజయవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు. గొడవలో గాయాలు అవ్వడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీస్ ప్రొటక్షన్ మధ్య అతడికి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి కుదటపడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వద్ద నుంచి తోట సందీప్ హత్యకు వినియోగించిన రెండు కత్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. (చదవండి : బెజవాడలో అలజడి)
కాగా ఇప్పటికే ఈకేసులో ఇరు వర్గాలకు చెందిన 33 మందిని పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితులపై రౌడీ షీట్లు తెరవనున్నారు. నేరచరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగరబహిష్కరణ చెయ్యాలని నిర్ణయించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
(చదవండి : పండు.. మామూలోడు కాదు!)
Comments
Please login to add a commentAdd a comment