సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్టణం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చింతపాడు మండలం మేడూరు గ్రామంలో బుధవారం ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో పాండు(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.