cell phone charging
-
పేలిన మొబైల్
కృష్ణరాజపురం : ఛార్జింగ్ పెడుతుండగా సెల్‌ఫోన్ పేలిపోయిన ఘటన సోమవారం బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన చంద్రు అనే యవకుడు కొద్ది రోజుల క్రితం రెడ్మి మొబైల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన చంద్రు వెంటనే దూరంగా పారిపోయాడు. పొగలు రావడం మొదలైన కొద్ది క్షణాల్లో మొబైల్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి..
ధరూరు (గద్వాల) : సెల్‌ఫోన్‌కు చార్జంగ్ పెట్టబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని భీంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని జాంపల్లి గ్రామానికి చెందిన ఒద్దిగడ్డ రాములు(28) తన మేనత్త గారి ఊరైన భీంపురంలో మంగళవారం జరిగిన ఊర దేవర ఉత్సవాలకు వచ్చాడు. బుధవారం ఉదయం తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టబోయి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో భీంపురం, జాంపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. రాములు భార్య పావని ప్రస్తుతం గర్భిణి. సమాచారం అందుకున్న రేవులపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి శవాన్ని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గద్వాల ఏరియా ఆస్పత్రిలో రాములు బంధువుల రోదనలు మిన్నంటాయి. రాములు భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మురళీగౌడ్ తెలిపారు. కర్వెనలో మరో బాలిక.. భూత్పూర్ (దేవరకద్ర) : మండలంలోని కర్వెనలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ బాలిక మృత్యువాత పడగా.. మరో ఘటనలో బాలిక త్రుటిలో తప్పిం చుకుంది. గ్రామానికి చెందిన భీముడు, వసంత దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లి వచ్చారు. సెల్ఫోన్లో చార్జింగ్ అయిపోయిందని గమనించిన రవళి(12) కరెంట్ బోర్డుకు చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. రవళి స్థానిక ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుంది. బుధవారం ఉదయమే ఇదే గ్రామంలో జానంపేట రాములు కుమార్తె శివలీల సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురవడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్విచ్‌ను ఆఫ్ చేయడంతో గాయపడింది. వెంటనే ఆమెను జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..
సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరామన్(55) తాపీ మేస్త్రీ. స్థానిక ఐకేపీ గోడౌన్లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు. -
చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి
విశాఖపట్టణం: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. చింతపాడు మండలం మేడూరు గ్రామంలో బుధవారం ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో పాండు(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చార్జింగ్ పెడుతూ..యువకుడి మృతి
ఖానాపూర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ఓ యువకుడు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలం సోమర్‌పేటలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తూ కరెంటు షాక్ కొట్టింది. దీంతో బూక్యా కబీర్ దాస్(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుగూ మహిళ మృతి
యాచారం: సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతన్‌గౌరెల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కనక మంజుల(25) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ నుంచి తీసేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె కరెంట్ షాక్‌కు గురై మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, కుమారుడు క్రాంతి, కూతురు ప్రవళిక ఉన్నారు. -
ఊరంతా విద్యుత్‌షాక్ : ఒకరు మృతి
మెదక్ రూరల్ : ఎర్తింగ్ లోపం కారణంగా ఊరంతా విద్యుత్ షాక్ రావడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చౌట్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. కాగా కొద్ది రోజులుగా గ్రామంలో ఎర్తింగ్ లోపం కారణంగా విద్యుత్ షాక్ వస్తోంది. శుక్రవారం కూడా ఊరంతా షాక్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన మిద్దింటి ముత్యం (45) సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గుైరె కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చాకలి లింగం సైతం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. చీమల చంద్రయ్య ఇంట్లో స్విచ్ ఆఫ్ చేస్తుండగా షాక్ తగిలింది. కొంటూర్ భూమయ్య, కొంటూర్ అశోక్, గుంజరి భిక్షపతి, పాతూర్ యాదమ్మలతో పాటు పలువురు విద్యుదాఘాతానికి గురయ్యాడు. శుక్రవారం ఒక్క రోజే సెల్‌ఫోన్ చార్జర్లు, టీవీలు, రైస్ కుక్కర్లు, డిష్‌లతో పాటు పలువురి ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో అధికారులు గ్రామంలో కరెంట్ సరఫరాను నిలిపివేశారు. గత ఆరునెలల క్రితం ఇదే మాదిరిగా షాక్ వచ్చిందని అప్పట్లో ట్రాన్స్‌కో అధికారులు సమస్యను పరిష్కరించారు. అయితే కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెల కొందని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ వినాయక్‌రెడ్డి, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మి, ట్రాన్స్‌కో ఏడీ రామచంద్రయ్య, ఏఈ తిరుపతయ్యల గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుదాఘాతానికి గుైరె మృతిచెందిన ముత్యం మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రి తరలించారు. మృతుడికి మతిస్థిమితం లేని భార్య లక్ష్మితో పాటు 20 ఏళ్ల లోపు వ యస్సు గల ముగ్గురు కుమారులున్నా రు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మేకల సునీత, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌లు కోరారు. ఎస్ఐ ఔదార్యం : నిరుపేద కుటుంబానికి చెందిన మిద్దింటి ముత్యం విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడగా ఆయన కుటుంబం స్థితిగతులను తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వినాయక్‌రెడ్డి రూ. 5,000 ఆర్థిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించి ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఎర్త్ లోపం వల్లే షాక్ : గ్రామంలోని పలు ఇళ్లకు విద్యుత్ షాక్ రావడానికి కారణం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ లోపం కారణంగానే గ్రామానికి షాక్‌వచ్చిందని ట్రాన్స్‌కో ఏడీ రామచంద్రయ్య తెలిపారు. కాగా విద్యుత్ శాఖ నుంచి రూ. లక్ష మృతుడి కుటుంబానికి ఇప్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన వలిగొండ మండలం గొల్నేపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సింగపాక బాబు అలియాస్ నరేష్(21) తన చైనా సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టడానికి మిత్రుడి వద్ద చార్జర్ తెచ్చుకున్నాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టడానికి విద్యుత్ స్విచ్ వేశాడు. వెంటనే విద్యుత్‌షాక్ కొట్టడంతో కేకలు వేశాడు. సమీపంలోని అతని సోదరుడు నవీన్ వచ్చి నరేష్‌ను లాగేందుకు యత్నించాడు. అతనికి కూడా విద్యుత్‌షాక్ కొట్టింది. వెంటనే తేరుకుని స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటికే నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో రామన్నపేట వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడు రామన్నపేట డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ మేరకు ఎస్ఐ మంజునాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
ఇక వైబ్రేషన్ తోనే ఫోన్ ఛార్జింగ్!
న్యూయార్క్: ఏదైనా వాహనంలో వెళుతున్నప్పుడు మన వద్ద నున్న స్మార్ట్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే ఎంతో సతమవుతూ ఉంటాం. ఆఫీస్ కి వెళ్లే సమయంలోనో.. ఇంటికి వెళ్లే సమయంలోనో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇదే పరిస్థితి దాపురిస్తే ఎంతో మదనపడుతుంటాం. ఇక నుంచి ఆ బాధలను విముక్తి చేసేందేకు ఇంజనీర్లు వినూత్న ఛార్జింగ్ విధానాన్ని అభివృద్ది చేశారు. రైలు, బస్సు, బైక్..వాహనం ఏదైనా గానీ ఛార్జింగ్ అయిపోయినా సెల్ ఫోన్ కు వైరు లేకుండా ఛార్జింగ్ అయ్యే పద్ధతిని త్వరలో మనముందుకు తీసుకురానున్నారు. ఎలాంటి విద్యుత్ వైరూ అవసరం లేని నానో-జనరేటర్‌ను సెల్ ఫోన్లోనే అంతర్గతంగా అమర్చుతారు. అది సెల్‌ఫోన్ గురయ్యే వైబ్రేషన్ల ద్వారా తనకు తానే విద్యుత్‌ను ఉత్పత్తిచేసుకుని సెల్‌ఫోన్‌ను చార్జ్ చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జుడాంగ్ వాంగ్, చైనాలోని సన్ యట్సేన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నొసెటా శాస్త్రవేత్తల బందం దీనిని ఆవిష్కరించారు. ఈ నానో-జనరేటర్ ద్వారా వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులు తనకు తానుగానే ఛార్జింగ్ చేసుకునేందుకు కొత్త పరిష్కారం లభిస్తుందని వాంగ్ తెలిపారు. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్ చార్జింగ్
ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : సెల్‌ఫోన్ చార్జింగ్ ఆ ఇంటి పెద్ద ప్రాణం తీసింది. పిల్లలకు తండ్రిని దూరం చేసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతిచెం దాడు. మంగళవారం మండలంలోని అందుతండా గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని మిగిల్చింది. అందుతండా గ్రామానికి చెందిన పడ్వాల్ మల్కాన్(35) కూలీ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య సైనబాయి, కూతు ళ్లు సావిత్రి(6), సోని(3), ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. మంగళవారం కూలీ పని చేసి సాయంత్రం ఇంటికొచ్చాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ఇంట్లో ఉన్న విద్యుత్ బోర్డుకు చార్జర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. వెంటనే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆటోలో ఇంద్రవెల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఎస్సై హనోక్ గ్రామాన్ని సందర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.