ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : సెల్‌ఫోన్ చార్జింగ్ ఆ ఇంటి పెద్ద ప్రాణం తీసింది. పిల్లలకు తండ్రిని దూరం చేసింది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతిచెం దాడు. మంగళవారం మండలంలోని అందుతండా గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని మిగిల్చింది. అందుతండా గ్రామానికి చెందిన పడ్వాల్ మల్కాన్(35) కూలీ పనులు చేస్తుంటాడు. అతడికి భార్య సైనబాయి, కూతు ళ్లు సావిత్రి(6), సోని(3), ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు.
మంగళవారం కూలీ పని చేసి సాయంత్రం ఇంటికొచ్చాడు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ఇంట్లో ఉన్న విద్యుత్ బోర్డుకు చార్జర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ తగిలింది. వెంటనే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆటోలో ఇంద్రవెల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఎస్సై హనోక్ గ్రామాన్ని సందర్శించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ప్రాణం తీసిన సెల్‌ఫోన్ చార్జింగ్
Published Wed, Jan 8 2014 6:01 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement