
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ..
సిరిసిల్ల: సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ వ్యక్తి మృతిచెందాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరామన్(55) తాపీ మేస్త్రీ. స్థానిక ఐకేపీ గోడౌన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతిచెందాడు.