ఈ బుల్లితెర జంట విడిపోనుందా? | Dhee Contestant Aqsa Khan Break Up With Pandu | Sakshi
Sakshi News home page

పండు, అక్సాలు బ్రేకప్‌ చెప్పుకోనున్నారా?

Published Mon, Apr 5 2021 10:00 AM | Last Updated on Mon, Apr 5 2021 12:50 PM

Dhee Contestant Aqsa Khan Break Up With Pandu - Sakshi

ప్రముఖ డ్యాన్స్‌ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు సినిమాల్లో స్టార్‌ కోరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. అంతేగాక ఈ షోలో అదరగొట్టె స్టేప్పులతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న కంటెస్టెంట్స్‌ కూడా ఉన్నారు. అందులో అక్సా ఖాన్ కూడా ఉంది‌. ఢీ 10 కంటెస్టెంట్‌గా వచ్చిన అక్సా ఛాంపియన్‌ కాలేనప్పటికి ఈ సీజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. స్టేజ్‌పై స్వింగ్ జర‌ స్వింగ్‌ జర అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను, షో జడ్జ్‌లను మంత్రముగ్ధులను చేసింది. మరి ముఖ్యంగా తన డ్యాన్స్‌, ఆటిట్యూడ్‌తో శేఖర్‌ మాస్టర్‌ను కట్టిపడేసేది ఈ ముద్దుగుమ్మ. చివరి వరకు పోటీ ఇచ్చిన అక్సా ఫైనల్‌కు ముందే ఎలిమినేట్‌ అయ్యి ఇంటిదారి పట్టింది. 

అయినప్పటికి ఫైనల్‌లో అక్సాతో స్పెషల్‌ పర్ఫామెన్స్ కింద శేఖర్‌ మాస్టర్‌​ డ్యాన్స్‌ చేయించాడు. ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె స్వింగ్‌ జర పాటకు కాలు కదిపింది. దీంతో సెలబ్రెటీ అయిపోయన అక్సా పలు ఇంటర్వ్యూలో హీరోయిన్‌ అవ్వాలనేది తన కల అంటూ చెప్పుకొచ్చెది. ఇదిలా ఉండగా ఇదే షోలోని మరో డ్యాన్సర్‌, బుల్లితెర మైకల్‌ జాక్సన్‌ పండుకు అక్సాకు మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే పండును చాంపియన్స్ నుంచి ఎలిమినేట్ చేయడం అక్సాఖాన్‌ను బాధించింది. దీంతో ఆమె పండు కోసం శేఖర్‌ మాస్టర్‌తో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో సోషల్‌ మీడియాల్లో తీవ్ర దుమారం రేపింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ టాక్‌. అది తెలిసి ఢీ ప్రేక్షకులు, అభిమానులు పండు, అక్సాలు  ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో పండగ చేసుకున్నారు. 

అంతేగాక పలు కార్యక్రమాల్లో వీరిద్దరూ జంట డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వడంతో ఇక వీరద్దరిని జోడిగా పిక్సైయిపోయారు. అంతేగాక ఈ జంట త్వరలోనే ఓ డ్యాన్స్‌ అకాడమిని స్థాపించి సెటిల్‌ అయిపోయి పెళ్లి చేసుకొవాలనే యోచనలో ఉన్నట్లు కూడా ఇటీవల గుసగుసలు వినిపించాయి. ఇక అక్సా ప్రసుతం ఆర్‌జీవీ అనే మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు పండు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్‌ బిజీ అయిపోయాడు. అంతా బాగా సాగుతున్న క్రమంలో ఈ మధ్య పండు, అక్సాల మధ్య మాటలు తగ్గినట్లుగా కనిపిస్తోదంట. వీరిమధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు వినికిడి. కారణమేంటో తెలియదు గానీ పండు తనను దూరం పెడుతున్నాడని, తన ప్రవర్తన నచ్చడం లేదంటూ అక్సా తన సన్నిహితులతో వాపోయిందట. దీంతో ఈ జంట తమ ప్రేమయాణానికి బ్రేకప్‌ చెప్పుకునేలా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

చదవండి: 
ఈ వార్త నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండగే!
ఫోన్‌ నెంబర్‌ లీక్‌ చేసిన రాజ్‌ తరుణ్!‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement