
ప్రతీకాత్మక చిత్రం
కొరుక్కుపేట: అత్త చెవి కొరికిన ఓ అల్లుడు కటకటాలపాలయ్యాడు. మదురై జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు ... మదురై జిల్లా సమయనల్లూరుకు చెందిన ముత్తుకుమార్ ,కవిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టులో దాఖలు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కవిత పుట్టింటికి వెళ్లిన ముత్తుకుమార్ ఆమెతో ఘర్షణకు దిగాడు. సర్ది చెప్పేందుకు వచ్చిన అత్త లక్ష్మి చెవిని అల్లుడు ముత్తుకుమార్ కోపంలో కొరికేశాడు. నోప్పితో విలవిలలాడిన లక్ష్మిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ముత్తుకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment