
స్వామిజీకి దేహశుద్ధి చేసిన స్థానికులు
సాక్షి, వేలూరు(తిరువణ్ణామలై): తిరువణ్ణామలై గిరివలయం రోడ్డులో ఉంటున్న విదేవీ యువతిపై స్వామిజీ అత్యాచారానికి యత్నించాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అమెరికాకు చెందిన యువతి(31) ఐదు నెలల క్రితం తిరువణ్ణామలై వచ్చింది. లాక్‌డౌన్ కారణంగా తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులోని అరుణాచలనగర్‌లో ఒక ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఈ ప్రాంతంలో సాధువులు, స్వామిజీలు అధికంగా ఉంటున్నారు. నామకల్ జిల్లా తిరుమలై పట్టి గ్రామానికి చెందిన మణిగండన్(41) తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో స్వామిజీగా ఉంటున్నాడు. (అయినవాళ్లే హతమార్చారు.. )
ఆ యువతి ఆ ప్రాంతానికి తరచూ వెళ్లి వచ్చేది. ఆదివారం ఉదయం ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మణిగండన్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో పాటు ఇంటిలో ఉన్న కత్తితో మణిగండన్ స్వామిజీపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని మణిగండన్‌ను చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం తాలూకా పోలీసులకు అప్పగించారు. చదవండి: రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్
Comments
Please login to add a commentAdd a comment