muthukumar
-
అత్త చెవి కొరికిన అల్లుడు
కొరుక్కుపేట: అత్త చెవి కొరికిన ఓ అల్లుడు కటకటాలపాలయ్యాడు. మదురై జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు ... మదురై జిల్లా సమయనల్లూరుకు చెందిన ముత్తుకుమార్ ,కవిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల కోసం కోర్టులో దాఖలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత పుట్టింటికి వెళ్లిన ముత్తుకుమార్ ఆమెతో ఘర్షణకు దిగాడు. సర్ది చెప్పేందుకు వచ్చిన అత్త లక్ష్మి చెవిని అల్లుడు ముత్తుకుమార్ కోపంలో కొరికేశాడు. నోప్పితో విలవిలలాడిన లక్ష్మిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ముత్తుకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
కొడుకును అలా చూసి పేరెంట్స్ షాక్!
అన్నానగర్: రెండేళ్ల క్రితం మాయమైన యువకుడు హిజ్రాగా తిరిగి వచ్చిన సంఘటన తిరుపూర్‌లో జరిగింది. కె.సెట్టిపాళయం వోసి నగరానికి చెందిన తామరై సెల్వన్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని చిన్న కుమారుడు ముత్తుకుమార్ (20)తిరుపూరులోని బనియన్ సంస్థలో పని చేసేవాడు. 2015 మార్చి నెలలో పనికి వెళ్లిన ముత్తుకుమార్ హఠాత్తుగా మాయమయ్యాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో వెతుకుతున్న క్రమంలో ముత్తుకుమార్ చెన్నై వ్యాసర్పాడిలో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు అక్కడి చేరుక్నున్నారు. హిజ్రాగా మారిన అతన్ని విచారణ చేయగా మహిళగా మారాలనే ఇంటి నుంచి బయటకి వచ్చానని, పేరును కీర్తనగా మార్చుకున్నానని తెలిపాడు. చెన్నైలో ఒకరి సహాయంతో మదురైకి వెళ్లి శస్త్రచికిత్స ద్వారా హిజ్రాగా మారానన్నాడు. ఇలా ఉండటమే తనకు ఇష్టమని పోలీసుల విచారణలో చెప్పాడు. ముత్తుకుమార్ దొరికాడన్న సంతోషంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులు హిజ్రాగా మారిన అతన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం పోలీసులు ముత్తుకుమార్‌ను తిరుప్పూరు కోర్టులో హాజరు చేశారు. ముత్తుకుమార్ తన ఇష్ట ప్రకారం ఉండవచ్చని మెజిస్ట్రేట్ నిత్యకళ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాత తల్లిదండ్రులతో అతను చెన్నైకి చేరుకున్నాడు. -
రూ.4 కోట్ల దోపిడీ కేసులో సీఐ అరెస్ట్
ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ పరారీ టీ.నగర్: కోయంబత్తూరు సమీపంలో రూ.3.9 కోట్లు కారులో అపహరించిన కేసులో పరమత్తి ఇన్స్పెక్టర్తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఎస్ఐ శరవణన్, హెడ్ కానిస్టేబుల్ ధర్మేంద్రన్, హవాలా ముఠా నేత కోడాలి శ్రీధర్, అతని కుమారుడు అరుణ్ కోసం గాలిస్తున్నారు. కేరళ రాష్ట్రం మలప్పురం ప్రాంతానికి చెందిన అన్వర్ సాదత్(35) నగల వ్యాపారి. ఇతని దుకాణంలో పని చేసే మహ్మద్ (53), ముషీర్ (35), సిదోష్ (32), కారు డ్రైవర్ ఆనంద్ (29) గత నెల 25న చెన్నై నుంచి కోయంబత్తూరు మీదుగా పాలక్కాడు వైపు కారులో వెళుతున్నారు. మదుక్కరై నీలంబూర్ బైపాస్ రోడ్డులో, ఈచ్చనారి వద్ద పోలీసు దుస్తుల్లో వచ్చిన నలుగురు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న వారిని దింపి వేసి నగదు సహా కారులో పారిపోయారు. ఆ కారులో రూ.3.9 కోట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై నగల దుకాణం యజమాని అన్సర్ సాదత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ రమ్యభారతి ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి... గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అందులోభాగంగా పోలీసులు త్రిచూర్‌కు చెందిన సుభాష్(42), సుధీర్(33), మలప్పురం ప్రాంతానికి చెందిన సబీక్(28)లను మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరపగా దోపిడీలో కరూర్ జిల్లా పరమత్తి ఇన్స్పెక్టర్ ముత్తుకుమార్, కుళిత్తలై ఎస్ఐ శరవణన్, హెడ్‌కానిస్టేబుల్ ధర్మేంద్రన్కు సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ ముత్తుకుమార్ సహా నలుగురిని అరెస్టు చేశారు. ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.