తమిళ బుల్లితెర నటి సుచిత్ర
సాక్షి, టీ.నగర్: సొంత ఇంట్లో చోరీ చేసి నాటకమాడిన బుల్లితెర నటి సుచిత్ర మంగళవారం పోలీసుస్టేషన్‌లో హాజరైంది. బన్రూట్టి సమీపంలోగల మాలిగైమేడు గ్రామానికి చెందిన దేసింగు (55). ఇతను సెప్టెంబర్ 12న ఇంటికి తాళం వేసి భార్య పచ్చయమ్మాల్, కుమారుడు మణికంఠన్‌తో బయటికి వెళ్లారు. దేసింగు ఇంటికి తిరిగిరాగా బీరువాలో ఉన్న 18 సవర్ల నగలు, నగదు చోరీకి గురయ్యాయి. పోలీసుల విచారణలో తన ఇంట్లో మణికంఠన్ చోరీ చేసిన విషయం తెలిసింది. మణికంఠన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో భార్య సుచిత్ర బుల్లితెర నటి అని, ఆమె సొంతగా సీరియల్ తీసేందుకు నగదు అవసరమైందని, దీంతో తాను, సుచిత్ర నగలు, నగదు చోరీ నాటకమాడినట్లు తెలిపారు.
సుచిత్ర మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కండిషన్ బెయిలు మంజూరుచేసి బన్రూట్టి మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. దీంతో సుచిత్ర సోమవారం బన్రూట్టి మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయింది. సుచిత్ర బన్రూట్టి పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఉదయం హాజరై సంతకం చేశారు. కరోనా నేపథ్యంలో లాక్‌డైన్ కారణంగా డబ్బుల ఇబ్బంది గురైన నటి సుచిత్ర తన ఇంట్లోనే పధకం ప్రకారం మణకంఠన్‌తో చోరీ నాటకమాడినట్టు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment