- ఛత్తీస్‌గఢ్‌లో మావోల దురాగతం
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోరుుస్టులు పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమే కాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన గిరిజనులను ఆదివారం మావోలు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తమ సమావేశాలకు హాజరుకాకపోవడం, సహకరించకపోవడం వంటి కార ణాలతో గిరిజనులను మావోలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. గత నెలరోజులుగా అడవుల్లో మావోయిస్టులు కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు.
20 రోజుల క్రితం గొల్లపల్లి సర్పంచ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్‌చేసి.. హతమార్చారు. వారం క్రితం గంగలేరు సర్పంచ్‌తో పాటు నలుగురిని కిడ్నాప్ చేసి విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. మి ర్తూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుందర్ కశ్యప్ శనివారం చేర్పాల్‌లో జాతర చూసేందుకు వెళ్లాడు. సుందర్‌ని జాతరలో కిడ్నాప్ చేసిన మావోలు గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని ఆదివారం పాలనార్ వద్ద పడేశారు.