గుత్తి(గుంతకల్లు) :
ఓ యువతిని కిడ్నాప్ చేసి నిర్భందించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష ఖరారైంది. పోలీసుల కథనం మేరకు... గుంతకల్లులోని భాగ్యనగర్‌కు చెందిన ఓ యువతి(22) ఇంటి బయట ఉండగా హిందూపురానికి చెందిన పఠాన్ అజ్మతుల్లా టాటాసుమోలో వచ్చి కిడ్నాప్ చేసి కర్నూలులోని ఓ ఇంట్లో వారం రోజుల పాటు నిర్భందించాడు. ఈ సంఘటన 2016 అక్టోబర్ 7న జరిగింది. దీంతో కిడ్నాప్‌నకు గురైన యువతి అక్క ఫిర్యాదు మేరకు గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.
ఆ తరువాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో సదరు కేసు గుత్తి అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే విచారణ మొదలు కాకముందే నిందితుడు తానే యువతిని కిడ్నాప్ చేసి నిర్బం«దించినట్లు అంగీకరించాడు. దీంతో అతనికి కిడ్నాప్ చేసినందుకు ఐదేళ్లు, నిర్భందించినందుకు మరో ఐదేళ్లు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ జడ్జి హరినారాయణ తీర్పు వెలువరించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తన తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎం.వి. మహేశ్‌కుమార్ వాదించారు.