దారుణం: పట్టపగలే కిడ్నాప్.. టీచర్‌ను వ్యాన్‌లో ఎక్కించి.. | Teacher Grabbed Pushed Into SUV In Daylight Karnataka Kidnapping | Sakshi
Sakshi News home page

దారుణం: పట్టపగలే కిడ్నాప్.. టీచర్‌ను వ్యాన్‌లో ఎక్కించి..

Published Thu, Nov 30 2023 9:09 PM | Last Updated on Thu, Nov 30 2023 9:17 PM

Teacher Grabbed Pushed Into SUV In Daylight Karnataka Kidnapping - Sakshi

బెంగళూరు: కర్ణాటకాలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ స్కూల్ టీచర్‌(23)ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. 

అర్పిత(23) స్థానికంగా ఓ పాఠశాలలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. నేడు రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఉన్న నేపథ్యంలో అర్పిత బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను వెంబడించారు దుండగులు. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి అమాంతం ఒక్కసారిగా ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. 

రాము అనే యువకుడే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని బాధిత యువతి తల్లి ఆరోపిస్తోంది. రాము, అర్పిత గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సెలవు రోజు అర్పిత ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లారు? ఇతర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.          

ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement